Posts

Showing posts from July, 2018

1. పఠత సంస్కృతం వరద సంస్కృతం ...

Image
1. పఠత సంస్కృతం వరద సంస్కృతం ... Audio Link సంస్కృతమును చదవండి, సంస్కృతమును (లో) మాట్లాడండి. ప్రతి ఒక్కరి ఇంటిలోనూ సంస్కృత భాష ప్రకాశిస్తూ ఉండాలి. మహర్షుల చేత అనుగ్రహించ బడిన, భవభయమును పారద్రోలే జ్ఞానరాశిని కలిగిన వేద వాఙ్మయమును కలిగిన సంస్కృత భాష ప్రకాశిస్తూ ఉండాలి. వ్యాసమహర్షి, భాసమహాకవి, కాళిదాసు, బాణభట్టులాంటి కవుల రచనలతో ప్రకాశించే గొప్పదైన సంస్కృతభాషను, గొప్ప పండితులతో ఔన్నత్యాన్ని పొంది, మాధుర్యమును కలిగి, నేర్చుకున్న వారికి ఉన్నతమైన గౌరవమును కలిగించే సంస్కృత భాషను అందరూ నేర్చుకోవాలి, సంస్కృతంలో మాట్లాడండి. సంస్కృతమును చదవండి.

2. జయ నమో విధిరమణి ...

2. జయ నమో విధిరమణి .. Audio Link భువనమోహిని అయిన, అభయమును అనుగ్రహించే తల్లి, బ్రహ్మదేవుని భార్య అయిన, సకల శుభములకు నెలవైన శుభప్రదురాలైన వాణికి, సరస్వతీ మాతకు జయమగుగాక. కరుణతో కూడిన అలలను వర్షించే కన్నులు కలిగి, అజ్ఞానమనే చీకటికి సూర్యకిరణములవంటిదైన, కలువ రేకుల వంటి కన్నులు కలిగిన జగన్మాతకు నమస్కరించుదాము. ఛందోబద్ధమైన అక్షరస్వరూపిణి అయిన వాణి రాజగృహములో గౌరవము కలుగ జేసే దేవి, అభయప్రదాయిని అయిన మాత కవులలో ప్రకాశించే తల్లి నా వాక్కులో ఓజస్సును తేజస్సును బలమును కలిగించు గాక ! భూమి మీద శోణీతటిలో వెలసిన, అందమైన బంగారు కాంతితో ప్రకాశిస్తూ, చేతిలో సుస్వనము కలిగిన వీణను ధరించి, అజ్ఞానమును పోగొట్టే తల్లికి జయమగుగాక !

3. చిర నవీనా సంస్కృతా ఏషా ...

3. చిర నవీనా సంస్కృతా ఏషా ... Audio Link మన ఈ గీర్వాణ భాష సనాతనమైనది, నిత్య నూతనమైనది, సంస్కృతి భరితమైనది. మహద్భూతమైన పరమాత్మ ఊపిరి అయిన, అత్యంత పురాతనమైన వేద సాహిత్యం కలిగిన భాష. స్మృతుల చేత, ధర్మ శాస్త్రముల చేత గొప్ప కవుల కావ్యసారమును కలిగిన అందమైన మంజులమైన భాష, ఒక మంజులమైన పెట్టెలాంటిది. వాల్మీకి వ్యాసుల చేత రచింపబడిన రామయణ భారతముల వలన సకల జనుల పాపాలను పోగొడుతూ, నీతిని తెలిపే కావ్య విషయాలను జగత్తుకిస్తూ, భగవంతుని చేత చెప్పబడిన, సకల వేద సారమైన భగవద్గీతను కలిగిన భాష సంస్కృత భాష. మన మాతృభాషలకు మాతృభాష అయిన భాష, భారతీయులకు రాష్ట్రభాష అవదగిన భాష, సాటిలేని మేటి భాష, సరళమైన భాష సంస్కృత భాష.

4. మృదపి చ చందనమస్మిన్దేశే ...

4. మృదపి చ చందనమస్మిన్దేశే ... Audio Link మన ఈ భారతదేశం లోని మట్టి కూడా సుగంధ భరితమైన చందనమే ! ఇక్కడ గ్రామములన్నీ సిద్ధవనాలు, బాలికలందరూ దేవతా స్వరూపాలు, బాలురందరూ శ్రీ రామచంద్రులే ! మన ఈ శరీరమే శ్రీహరి నివాస స్థానము. అందరి వద్ద ఉన్న ధనమూ మానవ సేవకే వినియోగించ బడుతుంది. ఇక్కడ వనాలన్నీ క్రీడా ఉద్యానవనాలే ! గోవులు మనకు తల్లితో సమానం. వృషభమే పరమ శివుడు. ఇక్కడి ప్రజలందరూ ఉదయమే ఈశ్వర గుణగానం చేస్తారు. దీపగానం చెయ్యటం వలన శతృవులు నశిస్తారు. ఋజుమార్గంలో సంపాదించిన ధనం వల్లే భాగ్యం కలుగుతుంది. త్యాగధనులు తపోధనుల కథలను కవులు గానం చేస్తారు. మహర్షులు గంగాజలంలా పవిత్రమైన జ్ఞానబోధ చేస్తారు. ఇక్కడి ప్రజలకు దేహ భ్రాంతి ఉండదు. వీరులు యుద్ధమందు ఆసక్తి కలిగి ఉంటారు. కర్షకులు తమ కార్యమందే ఆసక్తి కలిగి ఉంటారు. జీవన సాపల్యాన్ని కర్తవ్య నిర్వహణలోనే చూస్తారు. ఇక్కడ మానవ జీవన గమ్యం ధన సంపాదన కాదు, పదవులు పొందటం కాదు. పరమశివుని ప్రార్ధించటమే వీరి జీవన గమ్యం. అటువంటి మన భారతదేశంలోని మట్టి సుగంధ భరిత చందనంతో సమానం.

5. మనసా సతతం స్మరణీయం ...

5. మనసా సతతం స్మరణీయం ... Audio Link లోకానికి హితము చెయ్యాలనే ఎల్లప్పుడూ మనస్సు తో స్మరించాలి, మాటలతో ఎప్పుడూ పలుకుతూ ఉండాలి. భోగాలనుభవించాలని భవనాలలో ఉండాలనుకోకూడదు. మెత్తని పాన్పుల మీద పడుకోవాలని కోరుకోకూడదు. పగలు రాత్రి ప్రతిక్షణం జాగరూకత తో ఉండాలి. లోకానికి హితవు చెయ్యాలి. కార్యసాధనలో ఎన్ని కష్టాలెదురైనా లెక్క పెట్టకూడదు, దుఃఖాలను పరిగణించకూడదు. మన సుఖం చూసుకోకూడదు. సాధించ వలసిన కార్యం కోసం త్వరపడాలి. దుఃఖమనే సముద్రాన్ని దాటాలి. కష్టాలనే పర్వతాలనెక్కాలి. ఆపదలనే అరణ్యంలో తిరగాలి. ఎలాగైనా లోకానికి హితవు కలిగించే పనులు చెయ్యాలి. ఎంత గహనమైన అరణ్యంలోనైనా, కొండ గుహలలోనైనా, గాఢాంధకారంలోనైనా బంధువులకు ఆపదలు కలిగినప్పుడు నేను అక్కడ ఉండాలి.

6. జయ గంగాధర హర ...

6. జయ గంగాధర హర ... Audio Link ఇది సముద్ర మథన సమయంలో హాలాహలం పుట్టినప్పుడు దాన్ని సేవించి, లోకాలను రక్షించమని దేవతలు ఈశ్వరుని చేసిన స్తుతి. గంగాధర ! హర ! గిరిజారమణా ! నీకు జయమగుగాక ! కృపతో నీవు నన్ను రక్షించు ప్రభో శివ ! కైలాస శిఖరం మీద గహనమైన కల్పవృక్ష వనంలో తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. కోకిలలు కుహూరవాలు చేస్తున్నాయి, హంసలు ఎంతో సంతోషం తో నృత్యం చేస్తున్నాయి. అలాంటి లలితమైన ప్రదేశంలో మణులతో తయారు చేయబడిన ఒక మందిరముంది. ఆ మధ్యలో శివుని సమీపంలో గౌరీదేవి ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి గౌరీదేవితో కూడిన పరమశివ ! ఎంతోమంది అప్సర స్త్రీలు ఆనందంగా గానం చేస్తున్నారు, నర్తిస్తున్నారు. కిన్నర స్త్రీలు ఆనందంగా సప్తస్వరాలతో గానం చేస్తున్నారు. శివ ! ఓ మహాదేవ ! నీకు నమస్కారములు. గంధర్వులు తథిగిణతోమ్మని మృదంగం వాయిస్తున్నారు. ధింధింధిమ్మని, గానం చేస్తుంటే, నీవు క్వణనిక్వణములతో ఆనంద తాండవ నాట్యం చేస్తున్నావు. ఆ సమయంలో నీ కాలి నూపురములు ధ్వనిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. చక్రాల్లా నీ కాళ్ళను తిప్పుతుంటే, అందెలు కదులుతున్నాయి, నీవు డమరుకం వాయిస్తుంటే, నీ చేతివేళ్ళు ఆ శబ్దానికి తగ్గట్టుగా లాస్యం చేస్త...

7. విలసతు సా మే రసనాగ్రే ...

7. విలసతు సా మే రసనాగ్రే ... Audio Link మహర్షుల చేత ధ్యానములో సాక్షాత్కరించుకో బడిన వేదవాణి నా నాలిక మీదే ప్రకాశిస్తూ ఉండాలి, నా హృదయ పద్మమునందే నిలిచి ఉండాలి. ఏ వాణి పరాశర మన్వాది మహర్షుల చేత ధర్మశాస్త్రముల రూపంలో విస్తరించ బడిందో, ఏ వాణి వాల్మీకి మహర్షి చేత రచించబడిన రఘురాముని చరిత్ర కలిగి ఉన్నదో, ఏ వాణి వ్యాసమహర్షి చేత రచించబడిన పంచమవేద రూపంలో ఉన్నదో, ఏ వాణి జైమిని కపిల పతంజలి గౌతమాది మహర్షుల చేత రచించబడిన శాస్త్రముల రూపంలో ఉన్నదో, ఏ వాణి చేత వేదాంతము ప్రతిపాదింపబడి మోక్ష ప్రదాయకమైన తత్త్వ మార్గాన్ని తెలియ జేస్తోందో, ఏ వాణి భారవి బాణుడు మొదలైన వారి కావ్యనాటకాలతో ప్రసిద్ధి చెందినదో, చంపూ రచనలతో, రూపకాలతో ముక్తకాలతో, స్తోత్రాలతో ప్రకాశిస్తోందో, అటువంటి వాణి నా నాలిక మీదే ప్రకాశిస్తూ ఉండాలి, నా హృదయ పద్మంలో నిలిచి ఉండాలి. ఏ భాష ప్రపంచంలోని సర్వ భాషలకు ప్రాణము వంటిదో, కోటాను కోట్ల భాషలలో ఏ ఒక్క భాష దైవశక్తి భరితమైన దేవభాషో, అటువంటి వేదవాణి, దేవభాష నా రసనాగ్రమున నిలిచి ఉండుగాక ! నా హృదయ పద్మంలో ప్రకాశించు గాక !

8. శత శత కోటి శరత్పర్యంతం ...

8. శత శత కోటి శరత్పర్యంతం ... Audio Link వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి. సింధూనదీ, సుతుద్రీ నదీ సరస్వతీ నదీ తీరాలలో నివసించే ధ్యానపరులైన ఋషుల హోమవాటికలతో ప్రకాశిస్తూ, హోమాగ్ని లోంచి వెలువడే పొగతో లోకాలు పవిత్రీకృతం చేయబడుతుండగా, అత్రి భృగు ఋషుల చేత గానం చెయ్యబడే వేదఘోషతో వంద వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి వాల్మీకి, వ్యాస మహర్షుల చేత రచించబడిన శ్రీరామ, శ్రీకృష్ణుల గాథలు, లోకానికి కర్మ గురించిన సందేశమిచ్చే అఖండ జ్ఞాన దీపమై ప్రకాశించే భగవద్గీతతో ప్రకాశిస్తూ వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి. ఇది మన ధర్మభారతి. రాష్ట్ర ఐక్యతకు మహత్తరమైన స్ఫూర్తినిచ్చే సంస్కృత భాష లేకపోతే మన సంస్కృతియే లేదు. ఇహపర లోకాలలో శుభములను కలిగించే మన సంస్కృతి సంస్కృతము ప్రవహిస్తూ ఉండాలి. సంస్కృతం లేకుండా సంస్కృతి లేదని గుర్తించాలి. వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి.

9. జయినీ భవ సురవాణీ ...

9. జయినీ భవ సురవాణీ ... Audio Link సురవాణికి జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాను. ఈ జగత్తుకు నువ్వు శుభవాణివి అగుదువు గాక ! శ్రుతులలో సుఖంగా నినదించే శుభప్రదురాలా ! కవివరులలో ప్రకాశిస్తూ, వరము లనుగ్రహించేదానా ! ఏ అవయవమునందు చ్యుతి లేనిదానా ! అంటే, పద వాక్య ప్రమాణాలలో వ్యాకరణ, మీమాంస, తర్క జ్ఞానము కలిగి ఉండి శబ్ద శక్తి కలిగిన దానా ! ఓ సురవాణీ ! నీకు జయమగుగాక ! నీ సర్వాంగములలో - సర్వ శాస్త్రములలో అచ్యుతుని జ్ఞానము - పరమాత్మ జ్ఞానము కలిగినదానా ! నవరసములను కలిగినదానా ! మధురమైనదానా ! నీవే కామధేనువువు, సకల కామనలను తీరుస్తావు. నీవే జ్ఞానామృతము ! జ్ఞానమును వర్షిస్తావు. అటువంటి సురవాణికి - సంస్కృత భాషకు జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాను. ఈ సకల జగత్తుకు నువ్వు శుభవాణివి అగుదువు గాక ! నీవు సనాతన ధర్మ మును ధరించి ఉన్నావు. భాషాజాలమును పుట్టిస్తున్నావు. భగవద్గీతామృత ధారను వర్షిస్తావు. అఖిల వేదసారమునూ ఎల్లప్పుడూ చెప్తూంటావు. నీవు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తావు, బుద్ధిని వృద్ధి చేస్తావు. అటువంటి సురవాణికి జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాన...

10. జయ జయ భారత దేశ జయధ్వం...

10. జయ జయ భారత దేశ జయధ్వం... Audio Link భారతదేశమా ! నీకు జయమగుగాక ! ఆనంద తాండవ నాట్యం చేస్తున్న కైలాసేశ్వరుడైన రుద్రునికి నమస్కరించి, దుష్ట రావణాసురుణ్ణి హతమార్చిన ధనుర్ధారియైన శ్రీరామునికి నమస్కరించి, హింసాపరుడైన కంసుని సంహరించిన చక్రధారియైన శ్రీకృష్ణుని స్మరించి, పరాక్రమవంతులైనవారందరికీ ప్రణమిల్లి భారతదేశమునకు జయమగుగాక అని ఘోషిద్దాము. సంజీవన పర్వతోద్ధారియైన, లంకను దగ్ధం చేసిన వీరాంజనేయ స్వామిని స్మరిద్దాము. హనుమంతునికి జయమగుగాక. మహాప్రతాపవంతుడైన, పర్వత గుహలలో నివసించిన రాణా ప్రతాప్ కు జయమగుగాక. ఛత్రపతి శివాజీకి, ఝాన్సీ లక్ష్మీ బాయికి, దేవీ రణచండీ దేవికి జయమగుగాక. పరాక్రమవంతులైనవారందరినీ స్మరిస్తూ మన భారత దేశమునకు జయమగుగాక అని ఘోషిద్దాము. గంగా యమునా బ్రహపుత్రా, గండకీ నదుల పవిత్ర జలములతో ప్రకాశించే, కృష్ణా గోదావరి సింధు నది నర్మదా నదుల చేత సరయూనదీ కావేరీ మొదలైన పవిత్ర నదులతో ప్రకాశించే, సహ్యాద్రి చేత, హిమవత్పర్వతముల ఉన్నతమైన శిఖరములతో ప్రకాశించే భారతమాతకు, సశ్యశ్యామలమై విరాజిల్లే భారతమాతకు జయమగుగాక. భారతదేశమా ! నీకు జయమగుగాక ! ఆనంద తాండవ నాట్యం చేస్తున్న కైలాసవాసియైన మహేశ్వర...

11. మమ మాతా దేవతా ...

11. మమ మాతా దేవతా ... Audio Link మా అమ్మ దేవత ! మా అమ్మ ఎంతో సరళమైనది, నాతో ఎంతో మృదువుగా ఉంటుంది. ఇంటి పనులను చెయ్యటంలో ఎంతో సామర్ధ్యం కలిగినది. మా అమ్మ సాటిలేనిది. నాకు చక్కగా పాలు తాగిస్తుంది, అన్నం పెడుతుంది, రోజూ నన్ను లాలిస్తుంది, నా మనస్సుకు సంతోషం కలిగిస్తుంది. మా అమ్మ దేవత. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేస్తుంది, నాకు పాఠం చెబుతుంది, నాకు శుభం కలిగిస్తుంది. ఓ దీపజ్యోతీ ! కళ్యాణీ ! నాకు శుభములను కలిగించు, ఆరోగ్యాన్ని, ధనమును, సకల సంపదలను కలిగించు. దుష్ట బుద్ధులను తొలగించు, అని నాతో ప్రార్ధింపజేసి నాకు సకల శుభాలను కలిగించే మా అమ్మ నాకు దేవత ! రాత్రిళ్ళు నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రబుచ్చుతుంది, ఎంతో మధురమైన పాటలు పాడుతుంది. మా అమ్మ దేవత ! మా అమ్మ ఎంతో సరళమైనది, నాతో ఎంతో మృదువుగా ఉంటుంది. ఇంటి పనులను చెయ్యటంలో ఎంతో సామర్ధ్యం కలిగినది. మా అమ్మ సాటిలేనిది. మా అమ్మ దేవత ! మా అమ్మ దేవత !!

12. గుణగణ మండిత ...

12. గుణగణ మండిత ... Audio Link గుణగణములతో ప్రకాశించే యదువరుడగు శ్రీకృష్ణ పరమాత్మతో కాంతిమంతమైన భారతమాత ప్రకాశిస్తున్నది. నీతిని బోధించే పరమాత్మ చెప్పిన భగవద్గీతా బోధ, బోధకులైన యోగీశ్వరులకు పరమ ఆప్తమైనది. అటువంటి గీతాబోధ కలిగిన భారత మాతకు జయమగుగాక ! రమ్యమైన దేవాలయములతో, సరిత్తులతో, క్రీడాంగణాలతో కూడి భవ్యమై ప్రకాశించే భారతమాత, తన కోరిక ఈడేరిన పరమ ధన్యురాలు. శుభ ఫలములను వృద్ధి చేసే మాన్యురాలు. శుభ ఫలములనిచ్చే, ఎంతో గౌరవార్హురాలైన భరత మాత శోభ జయించుగాక ! దయతో ప్రతిరోజూ మనకు మంగళములను కలిగించే భారతమాత జయము పొందుగాక ! జయమును పొందుగాక !! తన జనముల సముదాయమును - తన దేశములోని ప్రజలను రక్షించు గాక ! భారతమాత జయమును పొందుగాక ! జయమును పొందుగాక !

13. కృత్వా నవదృఢ సంకల్పం ...

13. కృత్వా నవదృఢ సంకల్పం ... Audio Link నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము. మనమే క్రొత్త మన్వంతరమును నిర్మించే శిల్పులము, మన రాష్ట్ర సమున్నతిని కోరుతున్నాము. మనము త్యాగధనులము, కార్యమును సాధించటంలోనే నిమగ్నమై ఉంటాము. మనము కార్య దక్షులము, బాధపడనివారము. నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము. భేదభావనలను పోద్రోలి, దీనులను, దరిద్రులను ఉద్ధరిస్తూ, దుఃఖ తప్తులైన వారిని ఆశ్వాసిస్తూ - ఊరడిల్లజేస్తూ, సంకల్పించిన కార్యమును విస్మరించక, ఎల్లప్పుడూ దానిని నెరవేర్చే ఆలోచనలతోనే ఉంటూ నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము. ప్రగతిపధము నుంచి కదలరాదు, వైదొలగరాదు, మన సంస్కృతి పరంపరను మనం రక్షించాలి. ఉత్సాహవంతులమయి, ఉద్వేగం లేకుండా నిత్యము నిరంతరమూ ప్రగతిపధములో ముందుకు సాగుదాము. నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్ర...

14. సంస్కృత వర్షం జనయతి హర్షం ...

14. సంస్కృత వర్షం జనయతి హర్షం ... Audio Link సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయడానికి సంస్కృత సంవత్సరంగా ప్రకటింపబడి సంస్కృత వర్షమయింది. ఇలా సంస్కృత వర్షం ఏర్పడటం హర్షాన్ని కలిగిస్తోంది. చాలా కాలం నుంచి కోరిన కోర్కె నెరవేరింది. ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తుంది. సంస్కృత వర్షమేర్పడటం కొత్త ప్రేరణను, నూతన ఉత్సాహమును, కొత్త శక్తిని కలిగిస్తుంది. ప్రతి గ్రామములో, ప్రతి ప్రాంతములో ప్రతిరోజూ ప్రతి పదము కొత్తగా భాసిస్తోంది. సంస్కృత సారము, సంస్కృత జ్ఞాన ధార సర్వమానవుల మనస్సులను పవిత్రం చేస్తోంది, శక్తి మంతం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి మనిషిలోనూ శ్రద్ధా భక్తులతో కూడిన రాష్ట్ర హితము కోరే దేశహిత కాంక్ష వృద్ధి చెందుతోంది. వృద్ధులలో కూడా చైతన్యం నింపి శక్తిమంతులను చేస్తోంది. సంస్కృత వర్షము హర్షమును కలిగిస్తోంది. ప్రతి వ్యక్తిలోనూ శ్రద్ధా భక్తి సమేతమైన నవ జాగరణ కలిగి, అపరిమితమైన రాష్ట్రహిత కాంక్షులై సర్వజనులు ఐకమత్యాన్ని పొందుతారు. కలుషిత భావాలు నశించిపోతాయి. కలిపురుషుడు అసహాయుడై నిలిచిపోతాడు. భారతమాతకు శుభము కలుగుతుంది. భరత మాత చిరునవ్వుతో కూడిన మృదువైన ముఖముతో, చిరు దరహా...

15. ఐక్యమంత్రము -

15. ఐక్యమంత్రము -యం వైదికా మంత్రదృశః .. Audio Link ఏ పరమాత్మను సనాతనులైన, వేద మంత్ర ద్రష్టలైన మహర్షులు ఇంద్రునిగా, యమునిగా, మాతరిశ్వునిగా అనగా వాయుదేవునిగా చెప్తారో, ఏ పరబ్రహ్మమును వేదాంతవేత్తలు అనిర్వచనీయుడు అని చెప్తారో, ఎవరిని పరబ్రహ్మ అంటూ బ్రహ్మ శబ్దంతో చెప్తారో, ఎవరిని శైవులు శివుడు - అంటారో, ఎవరిని వైష్ణవులు విష్ణువని స్తుతిస్తారో, బౌద్ధులు బుద్ధుడనీ, జైనులు అర్హుడనీ వ్యవహరిస్తారో, శిఖ్ఖులు సత్ శ్రీ అకాలంటారో, ఏ దైవాన్ని కొంతమంది శాస్త అనీ, మరికొంత మంది కుమారస్వామి అనీ అంటారో, ఏ జగదీశ్వరుడిని భక్తి తో స్వామీ అని, తల్లి అనీ, తండ్రి అనీ పిలుస్తారో, ఆ ప్రభువు అద్వితీయుడైన ఒకే పరమాత్మ. జగదీశ్వరుడైన ఆ ఒక్క పరబ్రహ్మ తత్త్వాన్నే భిన్న భిన్న నామాలతో రూపాలతో వ్యవహరిస్తారు. కానీ ఉన్నది ఒక్కటే తత్త్వము, ఒకే దైవము.

16. భువమవతీర్ణా నాక స్పర్ధినీ ...

16. భువమవతీర్ణా నాక స్పర్ధినీ ... Audio Link భూలోకానికి అవతరించిన, స్వర్గంతో స్పర్ధ కలిగిన - అంటే స్వర్గం కంటే మిన్న అయిన భారత ధరణి ఇది. ఇదే నా తల్లి. తలపైన మకుటంలా - కిరీటంలా హిమాలయాలు ప్రకాశిస్తున్నాయి, పాదాల దగ్గర పవిత్రమైన సముద్ర జలాలతో తడపబడుతూ, మధ్య ప్రాంతాలలో పవిత్రమైన గంగానదితో పవిత్రం చేయబడుతూ ఉన్నది నా మాతృమూర్తి సదృశమైన మాతృదేశము - భారతదేశము. కాశ్మీరంలో మంచు కురుస్తుంది. రాజస్థాన్లో ఎడారులు మండుతూ ఉంటాయి. మలయస్థానంలో చల్లని చక్కని గాలులు వీస్తుంటాయి. భారతజనని ఇది, నా మాతృభూమి ఇది. భిన్న భిన్న భాషలు మాట్లాడే వారికి ఆశ్రయమిచ్చిన భూమి ఇది, వివిధ మతాలను పోషిస్తూ, నానా తీర్థాలతో క్షేత్రాలతో పవిత్రమైన భారత ధరణి ఇది, నా మాతృభూమి ఇది. పుణ్యవంతులకు ఇదే స్వర్గము, పుణ్య జనులకు ఇదే రుద్రుని పినాకము, పుణ్యవంతులకు ఆశ్రయవంతమైనది ఈ ధరణి. ఇది నాకు మాతృమూర్తి. భూలోకానికి అవతరించిన, స్వర్గంతో స్పర్ధ కలిగిన భారత ధరణి ఇది, ఇదే నా తల్లి.

17. పఠామి సంస్కృతం నిత్యం ...

17. పఠామి సంస్కృతం నిత్యం ... Audio Link ప్రతిరోజూ సంస్కృతము చదువుతాను. ఎల్లప్పుడూ సంస్కృతమే మాట్లాడతాను. చక్కగా సంస్కృతమునే ధ్యానిస్తాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము చేస్తున్నాను. సంస్కృత భాషా ప్రసారానికి నా సర్వస్వాన్ని ధారపోస్తాను. ఎల్లప్పుడూ సంస్కృతమందు భక్తి కలిగి ఉంటాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము చేస్తున్నాను. సంస్కృతం కోసం బ్రతుకుతూ, సంస్కృతం కోసం ప్రార్ధిస్తూ,నన్ను నేను ఆహుతిగా భావించుకుంటున్నాను. సంస్కృత మాతకి నమస్కరిస్తున్నాను. హిందూ రాష్ట్రమును, సమాజమును, పవిత్రమైన సంస్కృతిని రక్షిద్దాము. మన రాష్ట్రమును విశ్వ గురువును చేద్దాము. ప్రతిరోజూ సంస్కృతము చదువుతాను. ఎల్లప్పుడూ సంస్కృతమే మాట్లాడతాను. చక్కగా సంస్కృతమునే ధ్యానిస్తాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము.

18. భారతమాతా బుధజన గీతా ...

18. భారతమాతా బుధజన గీతా ... Audio Link బుధజనుల చేత కీర్తించబడుతున్న, నిర్మలమైన గంగాజలముతో పవిత్రము చేయబడిన భారతమాతకు జయమగుగాక ! తన శిరోభాగములో హిమాలయ పర్వతముల మంచు పొరలతో విరాజమానమై, పాదముల వద్ద హిందూ మహా సముద్ర జలములు కలిగి, జఘన భాగంలో సత్యమనే లతలను, వృక్షములను వస్త్రములుగా ధరించి ప్రకాశిస్తున్న భారత జననికి జయమగుగాక ! ఋషివరుల చేత ఘోషింపబడుతున్న మంత్రములతో పులకిస్తూ, కవుల సముదాయము చేత కీర్తించబడిన పవిత్ర చరిత్ర కలిగిన, ధీరులు వీరులు అయిన రాజుల చేత పాలింపబడిన భారతమాతకు జయమగుగాక ! నా మనస్సులో ఎప్పుడూ నీ పాద యుగళమే భాసిస్తుంది. సంస్కృతము గురించి, మన సంస్కృతిని గురించి సతతము ఆలోచిస్తూ ఉంటాను. భావరాగలయతాళములతో మేళవించిన భారత జననీ ! నీకు జయమగుగాక ! బుధజనుల చేత కీర్తించబడుతున్న, నిర్మలమైన గంగాజలముతో పవిత్రము చెయ్యబడిన భారతమాతకు జయమగుగాక ! నా మనస్సులో ఎప్పుడూ సంస్కృతమును గురించి, సంస్కృతిని గురించి ఆలోచిస్తూ ఉంటాను. భారతమాతా ! నీకు జయమగుగాక !

19. కురుధ్వమద్య సజ్జతాం ...

19. కురుధ్వమద్య సజ్జతాం ... Audio Link ఓ రాష్ట్ర సైనికులారా ! శస్త్రములను ధరించి ఈ రోజే యుద్ధానికి సన్నద్ధమవండి. ముందుకు పయనించండి ! బయలుదేరండి ! యుద్ధం సిద్ధమై ఉంది. సైనికులందరూ యుద్ధభూమికి తరలి వెళుతున్నారు. మనమందరం కలిసి యుధ్ధం చేద్దాము. అందరినీ క్షణంలో మట్టిలో కలుపుదాము. శతృవులందరూ సంహరింపబడ్డారు, సంహరింపబడతారు. యుద్ధం చేద్దాము. యుద్ధం చేద్దాము. ఓ రాష్ట్ర సైనికులారా ! శస్త్రములను ధరించి ఈ రోజే యుద్ధానికి సన్నద్ధమవండి. ముందుకు పయనించండి ! వాయుపుత్రులతో సమానమైన మనం సూర్యుడిని కూడా మన చేతులలోకి తెచ్చుకుందాము. విజృంభిద్దాము. అగస్త్య మహర్షి సముద్ర జలాలను ఔపోసన పట్టినట్లుగా మనం కూడా విజృంభించి అసాధ్యాలను సుసాధ్యం చేద్దాము. ఔపోసన పట్టేటప్పుడు చేతిని గోకర్ణం ఆకారంలో పెట్టి, ఉద్ధరిణెతో అందులో పట్టేంత నీరును తీసి చేతిలో పోసుకుంటాము. అగస్త్య మహర్షి మీది గౌరవంతో సముద్రుడు - సముద్ర జలం వచ్చి అందులో పట్టేంత జలంలా మారి ఆయన చేతిలో చేరింది. అలా మనం కూడా మన భారతజాతికి సహజమైన ధర్మబలంతో తపోబలంతో అసాధ్యాలను సాధిద్దాము. మన బాలురందరూ అభిమన్యుడంత పరాక్రమవంతులే ! క్షణంలో యముణ్ణి కూడా జయించ...

20. ఏత బాలకాః ... భూమిరియం బలిదానస్య ...

20. ఏత బాలకాః ... భూమిరియం బలిదానస్య ... Audio Link బాలకులారా ! రండి. మీకు హిందూ దేశము యొక్క తేజస్సును చూపిస్తాను, భారత వర్షము యొక్క తేజస్సును వివరిస్తాను. ఇక్కడి మట్టి కూడా తల మీద పెట్టుకుని నమస్కరించవలసినది. ఈ భూమి బలిదానములు చేసినటువంటిది. దేశమాతకు జయమగుగాక ! భూమాతకు జయమగుగాక ! మన భారతదేశానికి ఉత్తరమున ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వతములున్నాయి. దక్షిణ దిశలో అరేబియా సముద్రమున్నది. భారత దేశంలో పరమ పావనమైన గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ అడుగడుగునా కనిపించే దివ్యత్వం దేవతల లోకంలో కూడా ఉండదు. దేవతలు అవతరించే ఈ దివ్య భారత భూమియే భూలోకంలో ఒకే ఒక్క దివ్య స్ధానము. ధర్మరక్షణ కోసం యుద్ధంలో మరణించటమే సన్మానముగా భావించే మహా పరాక్రమ వంతులైన, ఖడ్గవిద్య యందభిమానము కలిగిన రాజపుత్రులకు ఇది నెలవు. విశ్వవిఖ్యాతి గాంచిన ప్రతాపరుద్రుడు ఇక్కడివాడే ! ఇక్కడ శీల రక్షణ కోసం అసంఖ్యాకులైన పద్మినీ జాతి స్త్రీలు అగ్ని లో ఆహుతి అయి దగ్ధమయ్యారు. అటువంటి వీరుల పాదపద్మముల దుమ్ము - పరాగ రేణువులతో పవిత్ర మైనది ఈ దేశము. వంగ దేశము మొదలైన సర్వప్రాంతాలు పచ్చని పైరులతో మనోహరంగా ఉంటాయి. ఈ దేశంలో బాలురు కూడా...

21. హిందూ రాష్ట్ర సంఘటనం ... కేశవం స్మరామి ...

21. హిందూ రాష్ట్ర సంఘటనం ... కేశవం స్మరామి ... Audio Link హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే సుజనులచే పూజింపబడే పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను. ఇది సనాతనమైన హిందూ రాష్ట్రము, చీలికలు చేయబడి చిరకాలము దాస్యము ననుభవించినది. దుఃఖముతో, దైన్యముతో పీడించబడిందని తలుచుకుంటేనే బాధ కలుగుతోంది. పరమ పూజనీయుడైన కేశవుని సదాస్మరించాలి. ఈ దేశం జగతిలోకే శ్రేష్ఠమైనది. భగవద్ధ్వజమే రాష్ట్ర గురువుగా ఉన్నటువంటిది. ఎల్లప్పుడూ స్మరింపవలసిన గోప్పదైన దైవ తత్త్వాన్ని బోధిస్తున్నది. హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే, సుజనులచే పూజింపబడే, పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను. ధర్మాచరణే పరమ వ్రతముగా, సత్ శీలమే పరమ ప్రయోజనముగా ప్రవర్తించాలి. బోధించిన దానిని ఆచరించాలి. మన దేశానికి గొప్ప వైభవాన్ని తీసుకుని రావాలి. దేశ ప్రజలలో అంతర్గతంగా ఉన్న సకల భేదభావములు తొలగిపోవాలి. సంఘంలో అందరూ ఏకమై సంఘటితంగా ఉండాలి. హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే, సుజనులచే పూజింపబడే పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను. Sent from my iPhone

22. ఆయాహిరే ! ఆయాహిరే ...

22. ఆయాహిరే ! ఆయాహిరే ... Audio Link ఆకాశంలో అందమైన కాంతులతో ప్రకాశించే చందమామా ! ఇచటికి రమ్ము. అంతటా ఎంతో ఆహ్లాదకరమైన, మనోజ్ఞమైన చిక్కని వెన్నెలను వ్యాపింపజేస్తున్న చంద్రుడా ! వచ్చెయ్యి. వచ్చెయ్యి. సింధూనది ప్రవహిస్తూ, చంద్రకిరణాల స్పర్శతో ఆనందంగా ఉవ్వెత్తున తరంగాలు లేచి చేస్తున్న ఘోష రోదసిలోని గుహలలో ప్రతిధ్వనిస్తోంది. ఓ ధీవరా ! ఆకాశంలో ప్రయాణించు. తమస్సుకు ప్రియుడా ! తారకలనే కన్నులు కలిగిన ఆమెను నీ దరహాస కాంతులలో ముంచెత్తుతూ, నీ దేహమంతా మంజులమైన కాంతి పుంజమై సంచరించే చంద్రమా ! ప్రయాణించు. నక్షత్రాలు నిశ్చలంగా ప్రకాశిసిస్తున్నాయి. సాగరునిచే చుంబించబడి వెన్నెల ఎంతో మోదము పొందుతోంది. లాస్య హాస్యాలతో విలాసంగా చిత్తరువులా ప్రకాశిస్తోంది. రాగ రంజితమైన రాగిణిలా శోభిల్లుతోంది. ఆకాశగమనంలో ఉన్న ఓ ధీవరా ! ప్రయాణించండి. ప్రయాణించండి.

23. హిమగిరేః శృంగం ....

23. హిమగిరేః శృంగం .... Audio Link హిమవత్పర్వత శిఖరములను, దేవనది అయిన గంగామాతను మనస్సులో నిలుపుకుని ఆనందాన్ననుభవిద్దాము. వేద పురాణములు జనించిన దివ్యమైన సనాతనమైన సంస్కృతి యొక్క ఉన్నతి అవనతులు ఎత్తుపల్లాలతో కూడిన సాటిలేని ఎత్తైన పర్వతశిఖరంలా ఉన్నాయి. హిమభవనాలు భీరులైన వారి మనస్సులలో కూడా ధీరస్వభావం కలిగిస్తున్నాయి. దేవలోకాన్ని దాటి అవతరించింది భాగీరథీ నది. భారతమాత సాంగత్యంలో భాగ్యవతి అయిన భాగీరథీ నది పుణ్యత నొందినది. హిందూ దేశం లోని ప్రతి ఒక్కరి మనసులో పవిత్రమైన దానిలా నిలిచి పోయింది. ఓడిపోవటం కూడా విజయానికి మెట్టు లాంటిదే ! ధైర్యమే విజయానికి కారణం. దుఃఖ పడుతున్న బంధువులకు ధైర్యం చెప్పటానికి సమాధాన పరచటానికి వెళదాము. మాతృదేశ గౌరవ రక్షణలో ధనము తనువు ప్రాణము కూడా సమర్పించటానికి సిద్ధమవాలి. హిమవత్పర్వత శిఖరములను, దేవనది అయిన గంగామాతను మనస్సులో నిలుపుకుని ఆనందాన్ననుభవిద్దాము.

24. స జయతి జగతి సనాతన ధర్మః ...

24. స జయతి జగతి సనాతన ధర్మః ... Audio Link జగత్తులో సనాతన ధర్మము జయము పొందుతుంది. ఇది సత్యము. సనాతన ధర్మము మానవాళికి చేస్తున్న మనోజ్ఞమైన, నిత్య నూతనమైన ఉపదేశమిది. శ్రీమహావిష్ణువునైనా, లేక శంకరుడినైనా పూజించండి. జినుడినైనా, బుద్ధుడినైనా లేక ఏ దైవమునైనా కొలవండి. ఉన్నది ఒక్క దైవమే ! పేర్లు మాత్రమే తేడా ! ఇందులో ఏమాత్రమూ వివాదం లేదు. ఇతడు స్పృశింపదగినవాడు, ఇతడు అస్పృశ్యుడు అనీ, ఒకడు ఉచ్చమైనవాడు మరొకడు నీచమైనవాడు అనీ ఈ విధమైన భావాలన్నీ, భేదాలన్నీ కేవలం కల్పితాలు మాత్రమే ! భూలోకమొక్కటే మనందరికీ నివాస స్ధానము, మానవులందరూ ఒక మానవజాతే ! కనుక అందరూ సోదరులే ! ఈ సత్యాన్ని విస్మరించవద్దు. జాతిలో భేదం లేదు, నీతిలో భిన్నత లేదు, మన లక్ష్యము, కార్యములు అభిన్నములే ! కనుక అందరూ కలిసి నడవండి. సంఘటితంగా ఉండటంలోనే శక్తి ఉంది. వేషాలు వదిలేసి, భేదాలు విస్మరించి, లక్ష్యాన్నే ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకుని మనమందరమూ కలిసి పనిచేస్తే, కార్య సిద్ధిని పొందుతాము. ధైర్యమునందు అభిలాష, చేసే పనులయందాసక్తి, దైవమునందు భక్తి, పాపమునందు విరక్తి అందరికీ కూడా భవభయములను తరించటంలో ఇదే ఉపాయము. మనస్సుతో ఎప్పుడూ శుభాన్నే భ...

25. నమో నమోంబ దేవవాణి ...

25. నమో నమోంబ దేవవాణి ... Audio Link దేవవాణీ ! అన్ని కోర్కెలను తీర్చే సంస్కృత భాషా మాతా ! నీకు నమస్కారము. కామరూపిణీ ! నన్ను పవిత్రురాలినిగా చెయ్యమ్మా ! నన్ను రక్షించమ్మా ! నీకు మనస్కారము. యజ్ఞ ధూమముతో పవిత్రము చేయబడిన, తపోవనవాటికలలో ప్రతిధ్వనించే తల్లీ ! పవిత్రమైన జలాలతో ప్రవహిస్తూ మంజులమైన ధ్వని చేస్తూ, యోగినిలా దర్శనమిచ్చే తల్లీ ! యోగము చేత పాపము పోగొట్టబడగా అమలినమైన ముఖములలో ప్రకాశించే తల్లీ ! భోగ రూపమైన సుందర స్వర్గమును, అపవర్గమును - మోక్షమును కూడా కలిగించే దేవవాణీ !నీకు నమస్కారము. అందమైన శబ్దములనబడే ముఖముతో మోహింపచేస్తూ, అందమైన పదములతో ప్రకాశిస్తూ, సుందర పదబంధ మార్గంలో పయనిస్తూ, వ్యాస, వాల్మీకి, కాళిదాస, భాసాదులతో ప్రకాశిస్తున్నదానా ! రమ్యమైన వాగ్విలాసంతో ప్రకాశిస్తూ, రంగస్థలం మీద నృత్తాలతో, నాట్యాలతో ప్రదర్శించబడటం వల్ల శోభిల్లుతూ, భవ్యమైన భావాలతో, వాగ్విలాసంతో ప్రకాశించే దేవవాణీ ! నీకు నమస్కారమమ్మా ! నా కోర్కెలను నెరవేర్చు. నన్ను కాపాడు, నన్ను పవిత్రం చెయ్యమ్మా ! తర్కశాస్త్రం చేత పద బంధాల చేత మనస్సును రంజించేదానా ! కర్మ గురించి, పరబ్రహ్మ గురించిన జ్ఞానాన్ని బోధిస్తూ,...

26. సాదరం సమీహతాం ...

26. సాదరం సమీహతాం ... Audio Link శ్రద్ధతో మాతృభూమిని ఆరాధించాలి. మాతృభూమి యొక్క శుభమును సాదరంగా కోరుకోవాలి, వందనములు సమర్పించాలి. ఎన్ని ఆపదలెదురైనా, మెరుపులు మెరిసినా, బాగా ప్రకాశించే శక్తిమంతమైన చాలా ఆయుధాలు తలల మీద పడుతున్నా సరే, ధైర్యం కోల్పోకూడదు. వీరత్వాన్ని ప్రదర్శించాలి. నిర్భయంగా అడుగులు ముందుకు వెయ్యాలి. సముద్రాన్ని కూడా ఒక్కచోటికి సేకరించాలి. మాతృభూమికి వందనములు సమర్పించాలి. శ్రద్ధతో మాతృభూమికి వందనం సమర్పించాలి. మాతృభూమియే మనకు ప్రాణప్రదాయిని. సకల శుభ ప్రదాయిని. శక్తి భక్తి, ముక్తి అనే అమృతాన్ని ప్రసాదించే ఈమెకు నమస్కరించటంలోను, సేవించటంలోను, అభినందించటంలోనే, స్వాత్మాభిమానం కలిగి జీవితం గడపటంలోనే ఆనందం పొందాలి. శ్రద్ధగా మాతృభూమికి వందనం సమర్పించాలి. వందనం సమర్పించాలి.

27. వయం హిందు సంజాతాస్సర్వే అస్మాకం పుణ్యం ...

27. వయం హిందు సంజాతాస్సర్వే అస్మాకం పుణ్యం ... Audio Link మనం మన పూర్వ పుణ్య విశేషాన హిందూ రాష్ట్రములో జన్మించాము. పరమ పవిత్రమైన భారత రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా గుర్తించాలి. ఇక్కడ జన్మించటమే చాలా దుర్లభమైన అదృష్టం. ఇక్కడ దైవం కూడా సిద్ధిస్తుంది, అనుగ్రహం వర్షిస్తూ ఉంటుంది. కర్మఫలాపేక్ష లేకుండా అందరూ కర్మలు చేస్తూ ధర్మనిష్ఠులై ఉంటారు. మా పుణ్యవశాన మనమందరమూ ఇక్కడ ఈ భారతదేశంలో పుట్టాము. పావన రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావించావి. మాలో ఏ భేదభావములు లేవు. మాలో ఏ వాదాలు లేవు. భిన్న మతాలన్నింటినీ ఏకం చేసి, కలిసి నడుస్తాము, కలిసి మాట్లాడతాము. మేమందరమూ హిందూదేశంలో పుట్టాము. అది మా పుణ్యవిశేషము. మా మాతృమూర్తి భారతమాత. ఆమెను సేవించే పుత్రులము మేము. ఈ విధంగానే భావిస్తూ సత్యం పలుకుదాము, ధర్మం ఆచరిద్దాము. మనం మన పూర్వ పుణ్య విశేషాన హిందూ రాష్ట్రములో జన్మించాము. పరమ పవిత్రమైన భారత రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిద్దాము. ఇక్కడ జన్మించటమే చాలా దుర్లభమైన అదృష్టం.

28. భారతి మామవ భగవతి భైరవి ...

28. భారతి మామవ భగవతి భైరవి ... Audio Link భారతీ ! నన్ను కాపాడు తల్లీ ! భగవతి, భైరవి, శాంభవి, గౌళాంగ సుందరీ ! అవధి లేకుండా ఆనందాన్ని కలిగించేదానా ! విద్యాప్రదాయినీ ! నిరతిశయ ఆనంద ప్రదాయినీ ! అనంత ఫలముల నిచ్చేదానా ! భారతీ ! మమ్మల్ని కాపాడు తల్లీ ! పద్మములవంటి సుకుమారమైన పాదములు కలదానా ! సరసిజాసనా ! శరదిందు వదనా ! కరములలో వీణా పుస్తక కమలములను ధరించిన తల్లీ ! అందమైన తెల్లని కాంతి వంతమైన ముక్తాహారములతో ప్రకాశించే తల్లీ ! భారతీ ! నన్ను కాపాడు తల్లీ ! భగవతి, భైరవి, శాంభవి, గౌళాంగ సుందరీ ! అవధి లేకుండా ఆనందాన్ని కలిగించేదానా ! విద్యాప్రదాయినీ ! నిరతిశయ ఆనంద ప్రదాయినీ ! అనంత ఫలములనిచ్చేదానా ! భారతీ ! మమ్మల్ని కాపాడు తల్లీ !

29. జయతాత్ సంస్కృత వాణీ మధురా ....

29. జయతాత్ సంస్కృత వాణీ మధురా .... Audio Link మధురమైన సంస్కృత వాణికి జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించబడుగాక ! మంజుల భాషిణియై, అందమైన విలాసము కలిగిన, రమ్యమైన కలరవముతో నదిలా ప్రవహించే సంస్కృత వాణికి, సరస్వతీ మాతకు జయమగుగాక ! పవిత్రమైన ముని జనుల కుటీరములలో విహరించునటువంటి, సుమనో మందిరములకు లాస్యమును కలిగించునటువంటి, అంతులేని సౌందర్య రాశీ ! లలిత కళా స్వరూపిణీ ! వల్మీకము లోనుంచి పుట్టిన ఆది కవీశ్వరుని వలన ఘనత గాంచినదానా ! ఓ జ్ఞానప్రదాయినీ ! సరస హృదయులకు విలాసము కలిగించుదానా ! పెద్ద విపత్తులను కూడా ఉపశమింపజేయుదానా ! మధురమైన సంస్కృత వాణీ ! నీకు జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించబడుదువు గాక ! సత్యము, శాంతి, శమము, దమములను ఉపదేశించుదానా ! ధర్మకార్యాలు చెయ్యటానికి ధైర్యాన్ని కలిగించేదానా ! రసవిహీనమైన జగత్తులో నవరసాలను నింపినదానా ! జనుల తాపాన్ని వెంటనే పోగొట్టేదానా ! కలి దోషాలను పోగొట్టు తల్లీ ! భవసాగరాన్ని దాటించేదానా ! సరసిజభవుడైన బ్రహ్మదేవుని పట్టపురాణీ ! సరస్వతీదేవీ ! మధురమైన సంస్కృత వాణీ ! నీకు జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించ బడుదువుగాక ! 🙏🙏🙏🌹 డా.విశాలాక్షి.

30. మునివర వికసిత కవివర విలసిత ...

30. మునివర వికసిత కవివర విలసిత ... Audio Link మునివరులతో వికసింపబడిన, కవివరులతో ప్రకాశించే మంజులమైన పెట్టెలాంటిది సుందరమైన సురభాష. ఓ తల్లీ ! సురభాషా ! ఎంత సహనంతో మమ్మల్ని పోషిస్తున్నావో, నా మాటలతో చెప్పలేను. ఓ అందమైన దేవభాషా ! నీవు వేద వ్యాస, వాల్మీకి, కాళిదాస భాస, బాణభట్టాది కవుల రచనలతో పరిపుష్టమయి, పురాణాల కథనంతో సామాన్య జనులకు జీవితాశను కలిగిస్తున్నావు. శ్రుతుల రూపంలో జ్ఞానాన్ని బోధిస్తూ అందరికీ ప్రమోదము కలిగిస్తూ, స్మృతుల రూపంలో సరసమైన, సౌఖ్యవంతమైన జీవన మార్గాన్ని బోధిస్తూ, ఆనందాన్ని కలిగిస్తూ, ఎన్నో కావ్య రచనలు చేయటానికి ప్రేరణనిస్తూ, సంస్కృతిని నింపుకుని ఉన్న సుందరమైన సురభాషవు నీవు. నవరసాలతో కూడిన రచనలతో అలంకరింప బడుతూ, వేద విషయమైన వేదాంతసారాన్ని విచారిస్తూ, వైద్యశాస్త్రమూ, వ్యోమ శాస్త్రము, ఖగోళ విజ్ఞానము కలిగి శోభిల్లుతున్న నీవు ఈ భూమిలో విజయమును పొందుదువు గాక ! మునివరులతో వికసింపబడిన, కవివరులతో ప్రకాశించే మంజులమైన పెట్టెలాంటిది సుందరమైన సురభాష. దేవభాష జయమును పొందుగాక ! 🙏🙏🙏🌹 డా. విశాలాక్షి

31. సంస్కృతేన సంభాషణం కురు .......

31. సంస్కృతేన సంభాషణం కురు ....... Audio Link సంస్కృతం లో సంభాషించు. జీవితంలో మంచి మార్పును తెచ్చుకో ! ఎక్కడెక్కడికి వెళ్ళినా, అక్కడ సంస్కృతాన్ని చూడు. అంటే అందరూ సంస్కృతం లో సంభాషించేలా ప్రయత్నించు. సంస్కృతమును, మన సంస్కృతిని రక్షించు. మన జీవితానికి లక్ష్యమేమిటి ? మన జీవన లక్ష్యము సంస్కృతమును వర్ధిల్లజేయటమే ! సంస్కృత భాషలో స్ఫూర్తి ఉంది. మనకు దానియందు ప్రీతి ఉంది. సంస్కృత భాష వర్ధిల్లటంలో మనకు స్ఫూర్తి, ప్రీతి ఉన్నాయి. సంస్కృత రక్షణమును, మన సంస్కృతి రక్షణను కోరుదాము. సంస్కృత రక్షణమునకు జీవితాన్ని సమర్పిద్దాము. మనం మన హిందూ సోదరులందరినీ మేల్కొల్పుదాము ! సంస్కృత రక్షణకు ప్రేరేపిద్దాము. సంస్కృతామృతమును మనం త్రాగుదాము, అందరితో తాగిద్దాము. మన దేశ హిత చింతన లేని జీవనము వృధా ! అటువంటి జీవనమును గర్హించాలి. సంస్కృతాభిమానులమైన మనలో ఐక్యత వర్ధిల్లాలి. స్థిరమైన బుద్ధి కలగాలి. ధైర్యం ఉండాలి. భయము ఉండకూడదు. ఉదాసీనత ఉండకూడదు. మాతృదేశాన్ని రక్షించటము, సేవించటము, దీనులను దళితులను ఉధ్ధరించటము, సంస్కృత ప్రచారము చేయటమే మన జీవిత లక్ష్యమవాలి. సంస్కృతిని రక్షించటమే మన లక్ష్యమవాలి. సంస్కృతం లో సం...

32. ధ్యేయపథిక సాధక ...

32. ధ్యేయపథిక సాధక ... ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గం లో పయనించు. మృదువుగా నవ్వుతూ, తేనెలు చిలుకుతూ, అంటే తేనెలొలుకు మాటలను మాట్లాడుతూ, తల్లిని ఎప్పుడూ స్మరిస్తూ, మాతృదేశ మాతను స్మరిస్తూ ముందుకు దూసుకు వెళ్ళు. జీవితం శాశ్వతమైనది కాదు. ఈ వైభవము స్థిరమైనది కాదు. స్వార్ధాన్ని పులుముకోకుండా ఏ కార్యాలనాచరిస్తారో అవే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. జీవితంలో ఋజు మార్గ ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన సరళంగా ఉండాలి. ఆలోచనలు గొప్పగా ఉండాలి. మనం సమాజంతో పోషించ బడుతున్నాము. మనం కూడా సమాజాన్ని చిరకాలము పోషించాలి. ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గంలో పయనించు. ఎవరు మనసులో ఏది ఆలోచిస్తారో, దేనిని మాటలతో కీర్తిస్తారో, అదే, ఆ మూర్తే వారి మనస్సుల్లో, వారి జీవితాలల్లో నిండి ఉంటుంది. మాతృదేవి యొక్క చరణాలకు అనన్య భక్తితో మన జీవితాన్ని సమర్పించాలి. మాతృదేశ రక్షణే మన ధ్యేయం. ధ్యేయాన్ని సాధించటమే వ్రతంగా కలిగి మనమందరం కలిసి ఉండాలి. ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గం లో పయనించు. ఎంతమంది మన ముందరి వ...

33. విస్మృత భేదాః సన్తో ....

33. విస్మృత భేదాః సన్తో .... Audio Link ఓ సత్పురుషులారా ! పరస్పర భేద భావాలను విస్మరించండి. నిర్మల భావములను కలిగి, ఎల్లప్పుడూ అందరూ సమానమనే ఏకతా భావాన్ని హృదయంలో పొందండి. మన ప్రాచీన మహర్షులు, కవులు అందరూ, మానవులందరు ఐకమత్యంతో ఉండాలని కోరారు. అందరూ సుఖంగా ఉండాలని వారు చేసే గానం ఎంతో హృద్యమైనది. భాష వల్ల, ధనము వల్ల, మతము వల్ల కలిగే మదము, జాతి విభేదము ఎవరి హృదయాలలోనూ ఉండరాదు. దుఃఖిత జనులను ఉద్ధరించటం కోసం చేతులు జాపండి. ఓ సత్పురుషులారా ! పరస్పర భేద భావాలను విస్మరించండి. హృదయంలో నిర్మల భావములను కలిగి ఎల్లప్పుడూ అందరూ సమానమనే ఏకతా భావాన్ని పొందండి. గంగా, తుంగభద్ర, కావేరీ నదుల జలమంతా మనదేనని భావిస్తూ, సంకల్పించిన కార్యాన్ని చెయ్యటానికి బద్ధకాన్ని వదిలి ఆలస్యం చెయ్యకుండా త్వరగా ప్రయత్నించండి. ఈ భూమిని బంగారు పుష్పంగా మార్చటానికి రారండి. కోరిన కామితములను సాధించటానికి చెమటను శ్రోతస్సులా ప్రవహించనీయండి ! ధైర్యం వదలద్దు. ఘర్షణలు, దొంగతనాలు, వంచన, సంహరణలు, ప్రళయం వస్తే రానీ ! స్నేహమనే శ్రోతస్సు ప్రవహించాలి. అందరమూ సోదరులమనే పరస్పర ప్రేమ భావం హృదయంలో ప్రకాశించాలి. అందరికీ గాలి నీరు నిప్పు స...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

34. సరళ భాషా సంస్కృతం సరస ... Audio Link సంస్కృత భాష సరళమైన భాష, సరసమైన భాష, సరసము సరళము మనోజ్ఞము, మంగళము అయిన దేవభాష సంస్కృతము. మృదులము, మధురము, మనోహరము అయిన అమృతంతో సమానమైన భాష సంస్కృత భాష. సంస్కృతము దేవతల భాష, వేదముల భాష, భేద భావాలను నశింపజేసే దివ్య భాష, అమృతమైన శాశ్వతమైన సాటిలేని భాష, మన ఘనమైన పుణ్యములతో ప్రకాశిస్తూ, శుభములను కలిగిస్తూ, వరములననుగ్రహించే భాష. సంస్కృతము శాస్త్రముల భాష, శస్త్ర శాస్త్రము కలిగిన భాష. సంస్కృత భాష శబ్దశక్తి కలిగిన, మంత్రశక్తి కలిగిన భాష. చతుర్దశ భువనముల భాష సంస్కృత భాష. భవన భాష - అంటే సర్వ మానవుల భాష సంస్కృతం. భారతదేశం లోని కావ్యములలో ప్రకాశించే మనోజ్ఞమైన భాష సంస్కృతం. ఇది శాస్త్ర భాష, సర్వ శాస్త్రముల భాష, శస్త్ర శాస్త్రపు భాష, శబ్ద భాష. శబ్దశక్తి కలిగిన భాష. మన రాష్ట్ర భాష సంస్కృతం. మనకు ధర్మమును బోధించే భాష, కర్మ గురించి చెప్పే భాష, ధర్మకర్మలను ప్రచోదన చేసే భాష సంస్కృత భాష. సంస్కృత భాష నిజంగా విశ్వభాష. సంస్కృత భాష సరళమైన భాష, సరసమైన భాష, సరసము సరళము మనోజ్ఞము, మంగళము అయిన దేవభాష సంస్కృతము. 🙏🙏🙏🌹 డా. విశాలాక్షి

35. సురస సుబోధా **నైవ క్లిష్టా

Image
35. సురస సుబోధా .. నైవ క్లిష్టా ... Shloka Audio అమృతవాణి అయిన సంస్కృత భాష మంచి రసభరితమైనది. అందరికీ సులభంగా అర్ధమవుతుంది. విశ్వంలో అందరి మనస్సులకు ఆనందాన్ని కలిగించే, లలితమైన భాష. హృదయానికి ఆనందం కలిగించే, రమణీయమైన సంస్కృత భాష కఠినమైనది కాదు, క్లిష్టమైనది కాదు. కవి కోకిల అయిన వాల్మీకి మహర్షి చేత రచింపబడిన రమణీయమైన రామాయణ కథ చాలా సులభంగా అర్ధమవుతుంది, మధురమైనది, మంజులమైనది. అది అసలు క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు. వ్యాసమహర్షి చేత రచింపబడి, గణపతి చేత లిఖించబడిన, కౌరవ పాండవ యుద్ధంతో కూడిన మహాభారత పుణ్యకథ క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు. కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉపదేశింపబడిన, కర్మ గురించి బోధించిన, విశ్వవందితమైన భగవద్గీత అమృతము వలె మధురమైనది. అది అసలు క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు. కవికులగురువైన కాళిదాస మహాకవి రస భరిత రచనలు రఘువంశ ము, కుమారసంభవము, ఋతుసంహారము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము అన్నీ కూడా క్లిష్టమైనవి కావు, కఠినమైనవి కావు. అమృతవాణి అయిన సంస్కృత భాష మంచి రసభరితమైనది. అందరికీ సులభంగా అర్ధమవుతుంది. విశ్వంలో అందరి మనస్సు...

నమశ్శివాయ* *శివానంద లహరి* శ్లోకం - 1

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *నమశ్శివాయ* *శివానంద లహరి* శ్లోకం - 1 AUDIO LINK కళాభ్యాం, చూడాలంకృత శశి కళాభ్యాం, నిజతపః ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం, హృదిపునర్భవాభ్యాం, ఆనందస్ఫురదను భవాభ్యాం నతిరియమ్ !! 1 !! ఈ శ్లోకానికి పదాన్వయం చూద్దాము. శివాభ్యాం ఇయం మే నతిః భవతు. ఇయం శివాభ్యాం మే నతిః భవతు. అంటే జగత్పితరులగు పార్వతీపరమేశ్వరులకు నమస్కరించు చున్నాను. ఇయం అనే పదమునకు అర్ధము ఈ. ఈ పితరులకు అనవచ్చును. అప్పుడు ప్రత్యక్షంగా మన ఎదుట ఉన్న వారు అని స్ఫురిస్తుంది. అంటే వారు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారని అర్ధమవుతుంది. ఈ శివ పార్వతులు అని చెప్తున్నాము. పితరులకు ఈ నమస్కారములు చెందునుగాక ! అనవచ్చును. ఇది ఈ శ్లోకంలో ముఖ్యమైన వాక్యము. మిగతా పదాలన్నీ ఈ 'శివాభ్యాం' అనే పదానికి విషేషణాలు. ఎటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారములు ఛేస్తున్నాము అంటే, కలాభ్యాం, చూడాలంకృత శశికళాభ్యాం, నిజ తపః ఫలాభ్యాం, భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, అస్తోక త్రిభువన శివాభ్యాం, హృది పునర్భవాభ్యాం, ఆనంద స్ఫురదనుభవాభ్యాం అయినటువంటి త్రిపుర సుందరీ సుందరేశ్వరులకు అన్నమాట ! ఈ ప...

పూజంతా అయ్యాక

🙏🌹 పూజంతా అయ్యాక చివరిలో - 'పాపో2హం, పాప కర్మా2హం, పాపాత్మా పాప సంభవః ...' అంటాము కదా ! ఎందుకు ? నేనేమీ పాపాలు చెయ్యలేదు కదా ! అలా ఎందుకనాలి? అని ఒకరి సందేహం ! దాన్ని తీర్చమని అడిగారు. 🙏🌹 యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ! తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే ! పాపో2హం పాప కర్మా2హం పాపాత్మా పాపసంభవః ! పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ! అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర !! అంటూ ప్రార్ధిస్తాము. మనం అసలు పాపాత్ములమే కాదు. మనం పరబ్రహ్మ స్వరూపులము. మనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త సచ్చిదానంద ఆత్మ స్వరూపులము. వేదవాణి మనను 'శృణ్వంతు సర్వే అమృతస్య పుత్రాః ....' అంటూ సంబోధించి ప్రబోధించింది. అమృతము అంటే మరణము లేనిది, అంటే పరమాత్మ. అమృతస్య పుత్రాః అంటే పరమాత్మ నుంచి ఉద్భవించిన సంతానం. ఇటువంటి వారు పాపాత్ములెలా అవుతారు ? మరి మనం 'పాపో2హం, పాప కర్మా2హం ...' అని ఎందుకంటాము ? మనం చేసే పనులతో, మాట్లాడే మాటలతో, మనస్సు లో కలిగే ఆలోచనలతో మనం కావాలని చేసినా వద్దని చేసినా, పుణ్యము, పాపము తప్పని సరిగా కలుగుతాయి. కనుక మనం చేసి...

జీవునికి ముక్తి

🙏🌹 జీవునికి ముక్తి పొందటానికి ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల లభించేది మానవ దేహం. మానవ ఉపాధి లభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం. 'జంతూనాం నరజన్మ దుర్లభ మతః పుంస్త్వం తతో విప్రతాత్ తస్మాద్వైదిక ధర్మమార్గపరతా విద్వత్వమస్మాత్పరమ్ ! ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్ధితిః ముక్తిర్నో శత కోటి జన్మ సుకృతైర్పుణ్యైర్వినా లభ్యతే' !! అని జగద్గురువులు శ్రీఆదిశంకర భగవత్పాదులు వివేకవంతమైన మానవ జీవిత మహోత్కృష్టతను గురించి చెప్పారు. మానవ జీవితం షడ్భావ వికారాలతో కూడి ఉంటుంది. ప్రతి ప్రాణి, ప్రకృతి లోని ప్రతి వస్తువు ఈ షడ్భావ వికారాలకు లోనవుతుంది. షడ్భావ వికారాలు లేనిది కేవలము పరమాత్మ మాత్రమే ! షడ్భావ వికారాలు కలిగిన మనం షడ్భావ వికారాలు లేని స్థితిని చేరటానికి ప్రయత్నం చెయ్యాలి. షడ్భావ వికారాలు - జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరిక్షీయతే, వినశ్యతి అనునవి. సృష్టిలో ప్రతిదీ ముందు పుడుతుంది. పుట్టింది కనుక అది ఉంటుంది. అస్తి ముందు చెప్పి జాయతే తరువాత కూడా చెప్పవచ్చును. ఉన్నది. ఆ ఉన్నది అన్నదే పుట్టింది. పుట్టినది వర్ధతే - వృద్ధి చెందుతోంది. వృద్ధి చెందు...

మాననీయ శ్రీమతి విశాలాక్షి గారికి హార్దిక శుభాభినందనవందనములు

Image
Dr. VLN Sastry MD(Ay)(BHU)., PGDHHM, M.Sc.(Psychology)., LL.B ~~~~~~~~~~~~~~~~~~~~ 06-06-2018~~~ ★మాననీయ శ్రీమతి విశాలాక్షి గారికి హార్దిక శుభాభినందనవందనములు. ************************** ■ (సీ) *తాతముత్తాతల తంగిరాలాన్వయ తత్త్వరక్తంబున్న తరుణితార *వేదవాజ్ఞ్మయయుక్త గోదావరీతోయ మాధుర్యసేవిత మహిళధీర *గీర్వాణసాహిత్య మృష్టాన్నసారంబు నరనరాలందున్న నారిరత్న *వేదాంతశోధనల్ విస్తృతంబుగజేసి ప్రాశస్త్యమందిన పడతిముక్త (తే.గీ.) *భూరి సోమంచివంశమున్ చేరియామె *జ్ఞానతృష్ణ రాధాకృష్ణ సతిగయయ్యె *భారతీయ ధర్మములకున్ పట్టుగొమ్మ *నుత విశాలాక్షి, హైందవమతపుకుక్షి. ★(ఆ.వె.) *మధురగాత్రమున్న మానవీయతయున్న *మంచి చిత్తమున్న మాతృమూర్తి *పుట్టినిల్లెగాక మెట్టినింటికిగూడ *దీప్తినిచ్చు భామ దివ్యమూర్తి. రాధాకృష్ణులలోని రాధయె విశా లాక్షీ స్వరూపమ్ము- జ్ఞా నా ధారప్రతిపాదకత్వము -సుధా న్నప్రాయసత్యాత్మక ప్రాదుర్భావవచోవిలాసము మహా వాక్య ప్రతిష్ఠా0తర శ్రీధుర్యమ్ము వెలుంగుగాత చిర కీ ర్తిన్ చంద్రతారార్క మై!! Sent from my iPhone

సంస్కృతమునందు సాధించె సత్తువెంతొ

సంస్కృతమునందు సాధించె సత్తువెంతొ పెక్కు వేదికలందున పేరువడసె పాడి వినిపించె మనలకు పాటవమున అమ్మ ఇచ్చుత సకలము అమ్మకెపుడు విదుషీమణి శ్రీమతి విశాలాక్షి అమ్మకు వినమ్రతతో ఆర్వీయస్ Sent from my iPhone

ధన్యవాదాలు

🙏🙏🙏🌹💐🌹 అత్యంత గౌరవనీయులైన, ఆత్మీయులందరికీ శిరసా కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🌹💐🌹 మనందరికీ పరమ ఆప్తులు ఆత్మీయులు, మన రసజ్ఞ భారతి సముదాయ స్రష్టలు డాక్టర్ బ్రహ్మశ్రీ ఆర్వీకుమార్ గారు బహు ఔదార్యవంతులు, రసజ్ఞులు. ' పర గుణ పరమాణూన్ పర్వతీకృత్య ...' అన్నట్లుగా నా పూర్వజన్మ సుకృతం వల్ల వారికి నాలోని అణుమాత్రపు సుగుణమే అత్యంత స్ఫూర్తిమంతంగా కనిపించి, ఇవాళ మన సముదాయంలో నన్ను పరిచయం చేసి మా మనస్సుకు ( నాకు మావారికి ) అమితానందాన్ని కలిగించారు. మన సముదాయంలో నేను తప్ప అందరూ కూడా ఛందోబద్ధమైన పద్య రచన చెయ్యగల కవులు, పండితులు, అవధాన కర్తలు. నేను తెలుగులో ఒక్క ఛందోబద్ధమైన పద్యమైనా రాయలేదు. ఒక్క గ్రంథమైనా ప్రచురించలేదు. తెలుగు సాహిత్య సముదాయమైన మన రసజ్ఞ భారతి సముదాయం లో నిజానికి నేను ఒక చిన్న విద్యార్థినిని మాత్రమే ! అటువంటి నన్ను ఆచార్యపదవిలో ఉంచి ఇవాళ ఇలా పరిచయం చెయ్యటమన్నది డా.ఆర్వీకుమార్ గారి సహృదయతకు, వారికి మా దంపతుల మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. వారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేక ధన్యవాదములు. 🙏🙏🙏🌹🌹💐💐🌹🌹 ఎంతో ఆదరంతో నా గురించిన సమాచారం తెలుసుక...

🙏🌹 పశువు, పశుపతి - పదాల విశిష్టత ఏమిటి ? వివరించమని అడిగారు…

🙏🌹 పశువు, పశుపతి - పదాల విశిష్టత ఏమిటి ? వివరించమని అడిగారు. 🙏🌹 " పాశ బద్ధః పశుః " అన్నారు. కాల పాశము చేత, కర్మపాశము చేత బద్ధులైనవారు పశువులు. కాలపాశము, కర్మ పాశము ఎవరి వశంలో ఉంటాయో వారు పశుపతి. " పశూన్ పాతి రమతే పునః తేషామధివసతి పాతి ఇతి పశుపతిః " - పశువులను సృష్టించి, వారితో ఆడుకుంటాడు, ఆనందిస్తాడు, వారి యందు నివసిస్తాడు, వారిని రక్షిస్తాడు కనుక మహేశ్వరుడు పశుపతి. "సర్వథా యః పశూన్ పాతి ఇతి పశుపతిః" అన్ని విధాలుగా పశువులను కాపాడేవాడు పశుపతి. ' పశుపాశ విమోచనుడు ' అని ఈశ్వరుడినీ, 'పశుపాశ విమోచనీ ' అని అమ్మవారిని అంటాము. " ప్రథమోహ్యేష దేవానాం, తం దేవానాం పరమం చ దైవతమ్ " అనేది వేద ప్రమాణం కనుక దేవదేవుడు మహాదేవుడు శివుడు. ఆ శివుని సహస్ర నామాలలో "పశుపతి " నామం ఒకటి. ఈ పేరుతో ఉన్న 'పశుపతినాథ్ ఆలయం' నేపాల్ లో ఉన్నది. దైవ నామాలలో కొన్ని దైవ మహత్వాన్ని, విభుత్వాన్ని చూపించేవి అవుతాయి. కొన్ని నామాలు దైవము చేసిన పనుల వల్ల, అనగా చూపించిన లీలల వల్ల ఆ పేర్లు వస్తాయి. శంభుః, శివః మొదలైనవి పరమేశ్వరుని విభుత్వాన్ని త...