16. భువమవతీర్ణా నాక స్పర్ధినీ ...

16. భువమవతీర్ణా నాక స్పర్ధినీ ...

Audio Link
భూలోకానికి అవతరించిన, స్వర్గంతో స్పర్ధ కలిగిన - అంటే స్వర్గం కంటే మిన్న అయిన భారత ధరణి ఇది. ఇదే నా తల్లి.

తలపైన మకుటంలా - కిరీటంలా హిమాలయాలు ప్రకాశిస్తున్నాయి, పాదాల దగ్గర పవిత్రమైన సముద్ర జలాలతో తడపబడుతూ, మధ్య ప్రాంతాలలో పవిత్రమైన గంగానదితో పవిత్రం చేయబడుతూ ఉన్నది నా మాతృమూర్తి సదృశమైన మాతృదేశము - భారతదేశము.

కాశ్మీరంలో మంచు కురుస్తుంది. రాజస్థాన్లో ఎడారులు మండుతూ ఉంటాయి. మలయస్థానంలో చల్లని చక్కని గాలులు వీస్తుంటాయి.
భారతజనని ఇది, నా మాతృభూమి ఇది.

భిన్న భిన్న భాషలు మాట్లాడే వారికి ఆశ్రయమిచ్చిన భూమి ఇది, వివిధ మతాలను పోషిస్తూ, నానా తీర్థాలతో క్షేత్రాలతో పవిత్రమైన భారత ధరణి ఇది, నా మాతృభూమి ఇది.

పుణ్యవంతులకు ఇదే స్వర్గము, పుణ్య జనులకు ఇదే రుద్రుని పినాకము, పుణ్యవంతులకు ఆశ్రయవంతమైనది ఈ ధరణి. ఇది నాకు మాతృమూర్తి.
భూలోకానికి అవతరించిన, స్వర్గంతో స్పర్ధ కలిగిన భారత ధరణి ఇది, ఇదే నా తల్లి.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...