28. భారతి మామవ భగవతి భైరవి ...

28. భారతి మామవ భగవతి భైరవి ...

Audio Link
భారతీ ! నన్ను కాపాడు తల్లీ ! భగవతి, భైరవి, శాంభవి, గౌళాంగ సుందరీ !
అవధి లేకుండా ఆనందాన్ని కలిగించేదానా ! విద్యాప్రదాయినీ ! నిరతిశయ ఆనంద ప్రదాయినీ ! అనంత ఫలముల నిచ్చేదానా ! భారతీ ! మమ్మల్ని కాపాడు తల్లీ !

పద్మములవంటి సుకుమారమైన పాదములు కలదానా ! సరసిజాసనా ! శరదిందు వదనా ! కరములలో వీణా పుస్తక కమలములను ధరించిన తల్లీ ! అందమైన తెల్లని కాంతి వంతమైన ముక్తాహారములతో ప్రకాశించే తల్లీ !

భారతీ ! నన్ను కాపాడు తల్లీ ! భగవతి, భైరవి, శాంభవి, గౌళాంగ సుందరీ !
అవధి లేకుండా ఆనందాన్ని కలిగించేదానా ! విద్యాప్రదాయినీ ! నిరతిశయ ఆనంద ప్రదాయినీ ! అనంత ఫలములనిచ్చేదానా ! భారతీ ! మమ్మల్ని కాపాడు తల్లీ !



Comments

Popular posts from this blog

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...