8. శత శత కోటి శరత్పర్యంతం ...
8. శత శత కోటి శరత్పర్యంతం ...
Audio Link
వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి. సింధూనదీ, సుతుద్రీ నదీ సరస్వతీ నదీ తీరాలలో నివసించే ధ్యానపరులైన ఋషుల హోమవాటికలతో ప్రకాశిస్తూ, హోమాగ్ని లోంచి వెలువడే పొగతో లోకాలు పవిత్రీకృతం చేయబడుతుండగా, అత్రి భృగు ఋషుల చేత గానం చెయ్యబడే వేదఘోషతో వంద వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి
వాల్మీకి, వ్యాస మహర్షుల చేత రచించబడిన శ్రీరామ, శ్రీకృష్ణుల గాథలు, లోకానికి కర్మ గురించిన సందేశమిచ్చే అఖండ జ్ఞాన దీపమై ప్రకాశించే భగవద్గీతతో ప్రకాశిస్తూ
వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి. ఇది మన ధర్మభారతి. రాష్ట్ర ఐక్యతకు మహత్తరమైన స్ఫూర్తినిచ్చే సంస్కృత భాష లేకపోతే మన సంస్కృతియే లేదు. ఇహపర లోకాలలో శుభములను కలిగించే మన సంస్కృతి సంస్కృతము ప్రవహిస్తూ ఉండాలి. సంస్కృతం లేకుండా సంస్కృతి లేదని గుర్తించాలి.
వందల వందల కోట్ల శరత్తుల పర్యంతం సంస్కృత మందాకిని ప్రవహిస్తూ ఉండాలి.

Comments
Post a Comment