19. కురుధ్వమద్య సజ్జతాం ...

19. కురుధ్వమద్య సజ్జతాం ...

Audio Link
ఓ రాష్ట్ర సైనికులారా ! శస్త్రములను ధరించి ఈ రోజే యుద్ధానికి సన్నద్ధమవండి. ముందుకు పయనించండి ! బయలుదేరండి !

యుద్ధం సిద్ధమై ఉంది. సైనికులందరూ యుద్ధభూమికి తరలి వెళుతున్నారు.
మనమందరం కలిసి యుధ్ధం చేద్దాము.
అందరినీ క్షణంలో మట్టిలో కలుపుదాము. శతృవులందరూ సంహరింపబడ్డారు, సంహరింపబడతారు. యుద్ధం చేద్దాము. యుద్ధం చేద్దాము.

ఓ రాష్ట్ర సైనికులారా ! శస్త్రములను ధరించి ఈ రోజే యుద్ధానికి సన్నద్ధమవండి. ముందుకు పయనించండి !

వాయుపుత్రులతో సమానమైన మనం సూర్యుడిని కూడా మన చేతులలోకి తెచ్చుకుందాము. విజృంభిద్దాము.
అగస్త్య మహర్షి సముద్ర జలాలను ఔపోసన పట్టినట్లుగా మనం కూడా విజృంభించి అసాధ్యాలను సుసాధ్యం చేద్దాము.
ఔపోసన పట్టేటప్పుడు చేతిని గోకర్ణం ఆకారంలో పెట్టి, ఉద్ధరిణెతో అందులో పట్టేంత నీరును తీసి చేతిలో పోసుకుంటాము. అగస్త్య మహర్షి మీది గౌరవంతో సముద్రుడు - సముద్ర జలం వచ్చి అందులో పట్టేంత జలంలా మారి ఆయన చేతిలో చేరింది. అలా మనం కూడా మన భారతజాతికి సహజమైన ధర్మబలంతో తపోబలంతో అసాధ్యాలను సాధిద్దాము.

మన బాలురందరూ అభిమన్యుడంత పరాక్రమవంతులే ! క్షణంలో యముణ్ణి కూడా జయించగలరు. ప్రయాణించండి !
రాష్ట్ర సైనికులారా ! ప్రయాణించండి !

భీమవిక్రముడైన చంద్రగుప్తుడిని
స్మరిద్దాము. మన ధమనుల్లోనే - అంటే మన రక్తంలోనే మంగళకరమైన పరాక్రమం ఉంది. దానిని విస్తరిల్లజేద్దాము.
ఈ పరంపర మధ్యలో ఖండించ బడకుండా చూద్దాము, కొనసాగిద్దాము. ఓ రాష్ట్ర సైనికులారా ! ముందుకు పయనించండి !

మీ ముందు అగ్ని కుండం చండ తాండవం చేస్తూ ఉంది. ఆసురీ శక్తుల్ని సంహరించి అందులో ఆహుతులుగా వేద్దాము. ఈ వంశము ప్రఖ్యాతిగాంచినది. మన మార్గము చాలా గొప్పది.

ఓ రాష్ట్ర సైనికులారా ! శస్త్రములను ధరించి ఈ రోజే యుద్ధానికి సన్నద్ధమవండి. ముందుకు పయనించండి ! ముందుకు పయనించండి ! !


\

Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...