10. జయ జయ భారత దేశ జయధ్వం...

10. జయ జయ భారత దేశ జయధ్వం...

Audio Link
భారతదేశమా ! నీకు జయమగుగాక ! ఆనంద తాండవ నాట్యం చేస్తున్న కైలాసేశ్వరుడైన రుద్రునికి నమస్కరించి, దుష్ట రావణాసురుణ్ణి హతమార్చిన ధనుర్ధారియైన శ్రీరామునికి నమస్కరించి, హింసాపరుడైన కంసుని సంహరించిన చక్రధారియైన శ్రీకృష్ణుని స్మరించి, పరాక్రమవంతులైనవారందరికీ ప్రణమిల్లి భారతదేశమునకు జయమగుగాక అని ఘోషిద్దాము.

సంజీవన పర్వతోద్ధారియైన,
లంకను దగ్ధం చేసిన వీరాంజనేయ స్వామిని స్మరిద్దాము. హనుమంతునికి జయమగుగాక. మహాప్రతాపవంతుడైన, పర్వత గుహలలో నివసించిన రాణా ప్రతాప్ కు జయమగుగాక. ఛత్రపతి శివాజీకి, ఝాన్సీ లక్ష్మీ బాయికి, దేవీ రణచండీ దేవికి జయమగుగాక. పరాక్రమవంతులైనవారందరినీ స్మరిస్తూ మన భారత దేశమునకు జయమగుగాక అని ఘోషిద్దాము.

గంగా యమునా బ్రహపుత్రా, గండకీ నదుల పవిత్ర జలములతో ప్రకాశించే, కృష్ణా గోదావరి సింధు నది నర్మదా నదుల చేత సరయూనదీ కావేరీ మొదలైన పవిత్ర నదులతో ప్రకాశించే,
సహ్యాద్రి చేత, హిమవత్పర్వతముల ఉన్నతమైన శిఖరములతో ప్రకాశించే భారతమాతకు, సశ్యశ్యామలమై విరాజిల్లే భారతమాతకు జయమగుగాక.
భారతదేశమా ! నీకు జయమగుగాక ! ఆనంద తాండవ నాట్యం చేస్తున్న కైలాసవాసియైన మహేశ్వరునికి నమస్కరించి మన భారత దేశమునకు జయమగుగాక అని ఘోషిద్దాము.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...