4. మృదపి చ చందనమస్మిన్దేశే ...

4. మృదపి చ చందనమస్మిన్దేశే ...

Audio Link
మన ఈ భారతదేశం లోని మట్టి కూడా సుగంధ భరితమైన చందనమే ! ఇక్కడ గ్రామములన్నీ సిద్ధవనాలు, బాలికలందరూ దేవతా స్వరూపాలు, బాలురందరూ శ్రీ రామచంద్రులే ! మన ఈ శరీరమే శ్రీహరి నివాస స్థానము. అందరి వద్ద ఉన్న ధనమూ మానవ సేవకే వినియోగించ బడుతుంది. ఇక్కడ వనాలన్నీ క్రీడా ఉద్యానవనాలే ! గోవులు మనకు తల్లితో సమానం. వృషభమే పరమ శివుడు. ఇక్కడి ప్రజలందరూ ఉదయమే ఈశ్వర గుణగానం చేస్తారు. దీపగానం చెయ్యటం వలన శతృవులు నశిస్తారు. ఋజుమార్గంలో సంపాదించిన ధనం వల్లే భాగ్యం కలుగుతుంది.
త్యాగధనులు తపోధనుల కథలను కవులు గానం చేస్తారు. మహర్షులు గంగాజలంలా పవిత్రమైన జ్ఞానబోధ చేస్తారు. ఇక్కడి ప్రజలకు దేహ భ్రాంతి ఉండదు. వీరులు యుద్ధమందు ఆసక్తి కలిగి ఉంటారు. కర్షకులు తమ కార్యమందే ఆసక్తి కలిగి ఉంటారు. జీవన సాపల్యాన్ని కర్తవ్య నిర్వహణలోనే చూస్తారు. ఇక్కడ మానవ జీవన గమ్యం ధన సంపాదన కాదు, పదవులు పొందటం కాదు. పరమశివుని ప్రార్ధించటమే వీరి జీవన గమ్యం. అటువంటి మన భారతదేశంలోని మట్టి సుగంధ భరిత చందనంతో సమానం.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...