14. సంస్కృత వర్షం జనయతి హర్షం ...
14. సంస్కృత వర్షం జనయతి హర్షం ...
Audio Link
సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయడానికి సంస్కృత సంవత్సరంగా ప్రకటింపబడి సంస్కృత వర్షమయింది. ఇలా సంస్కృత వర్షం ఏర్పడటం హర్షాన్ని కలిగిస్తోంది. చాలా కాలం నుంచి కోరిన కోర్కె నెరవేరింది. ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తుంది. సంస్కృత వర్షమేర్పడటం కొత్త ప్రేరణను, నూతన ఉత్సాహమును, కొత్త శక్తిని కలిగిస్తుంది.
ప్రతి గ్రామములో, ప్రతి ప్రాంతములో ప్రతిరోజూ ప్రతి పదము కొత్తగా భాసిస్తోంది. సంస్కృత సారము, సంస్కృత జ్ఞాన ధార సర్వమానవుల మనస్సులను పవిత్రం చేస్తోంది, శక్తి మంతం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి మనిషిలోనూ శ్రద్ధా భక్తులతో కూడిన రాష్ట్ర హితము కోరే దేశహిత కాంక్ష వృద్ధి చెందుతోంది. వృద్ధులలో కూడా చైతన్యం నింపి శక్తిమంతులను చేస్తోంది. సంస్కృత వర్షము హర్షమును కలిగిస్తోంది.
ప్రతి వ్యక్తిలోనూ శ్రద్ధా భక్తి సమేతమైన నవ జాగరణ కలిగి, అపరిమితమైన రాష్ట్రహిత కాంక్షులై సర్వజనులు ఐకమత్యాన్ని పొందుతారు.
కలుషిత భావాలు నశించిపోతాయి. కలిపురుషుడు అసహాయుడై నిలిచిపోతాడు. భారతమాతకు శుభము కలుగుతుంది. భరత మాత చిరునవ్వుతో కూడిన మృదువైన ముఖముతో, చిరు దరహాసముతో ప్రకాశిస్తుంది.
ఓ స్నేహితులారా ! లేవండి ! మేల్కొనండి ! ప్రజ్ఞను పొంది, మందకొడితనాన్ని,
సోమరితనాన్ని పోగొట్టి శక్తిని పొందండి, ప్రజలకు మేలు కలిగించే పనులు చెయ్యండి. విశ్వవిజయాన్ని సాధించే సంస్కృత ప్రచార యాత్రను సఫలం చేయటానికి మనం వెళదాము. భారతమాతను సర్వసమర్ధంగా చేసి, జగద్గురువునుగా చేద్దాము.
సంస్కృత భాషా ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయడానికి సంస్కృత వర్షం ఏర్పడటం హర్షాన్ని కలిగిస్తోంది. చాలా కాలం నుంచి కోరిన కోర్కె నెరవేరింది. ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తూ, కొత్త ప్రేరణను, నూతన ఉత్సాహమును, కొత్త శక్తిని కలిగిస్తోంది.

Comments
Post a Comment