13. కృత్వా నవదృఢ సంకల్పం ...

13. కృత్వా నవదృఢ సంకల్పం ...

Audio Link
నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము.

మనమే క్రొత్త మన్వంతరమును నిర్మించే శిల్పులము, మన రాష్ట్ర సమున్నతిని కోరుతున్నాము. మనము త్యాగధనులము, కార్యమును సాధించటంలోనే నిమగ్నమై ఉంటాము. మనము కార్య దక్షులము, బాధపడనివారము.

నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము.

భేదభావనలను పోద్రోలి, దీనులను, దరిద్రులను ఉద్ధరిస్తూ, దుఃఖ తప్తులైన వారిని ఆశ్వాసిస్తూ - ఊరడిల్లజేస్తూ, సంకల్పించిన కార్యమును విస్మరించక, ఎల్లప్పుడూ దానిని నెరవేర్చే ఆలోచనలతోనే ఉంటూ నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము.

ప్రగతిపధము నుంచి కదలరాదు, వైదొలగరాదు, మన సంస్కృతి పరంపరను మనం రక్షించాలి. ఉత్సాహవంతులమయి, ఉద్వేగం లేకుండా నిత్యము నిరంతరమూ ప్రగతిపధములో ముందుకు సాగుదాము.

నవ దృఢ సంకల్పమును చేసి, కొత్త సందేశమును వ్యాప్తి చేస్తూ, కొత్త సంఘటనలను ఘటింపజేస్తూ కొత్త చరిత్రను సృష్టిద్దాము. క్రొత్త చరిత్రకు మార్గదర్శకులమవుదాము.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...