23. హిమగిరేః శృంగం ....

23. హిమగిరేః శృంగం ....

Audio Link
హిమవత్పర్వత శిఖరములను, దేవనది అయిన గంగామాతను మనస్సులో నిలుపుకుని ఆనందాన్ననుభవిద్దాము.
వేద పురాణములు జనించిన దివ్యమైన సనాతనమైన సంస్కృతి యొక్క ఉన్నతి అవనతులు ఎత్తుపల్లాలతో కూడిన సాటిలేని ఎత్తైన పర్వతశిఖరంలా ఉన్నాయి. హిమభవనాలు భీరులైన వారి మనస్సులలో కూడా ధీరస్వభావం కలిగిస్తున్నాయి.

దేవలోకాన్ని దాటి అవతరించింది భాగీరథీ నది. భారతమాత సాంగత్యంలో భాగ్యవతి అయిన భాగీరథీ నది పుణ్యత నొందినది. హిందూ దేశం లోని ప్రతి ఒక్కరి మనసులో పవిత్రమైన దానిలా నిలిచి పోయింది.

ఓడిపోవటం కూడా విజయానికి మెట్టు లాంటిదే ! ధైర్యమే విజయానికి కారణం. దుఃఖ పడుతున్న బంధువులకు ధైర్యం చెప్పటానికి సమాధాన పరచటానికి వెళదాము. మాతృదేశ గౌరవ రక్షణలో ధనము తనువు ప్రాణము కూడా సమర్పించటానికి సిద్ధమవాలి.

హిమవత్పర్వత శిఖరములను, దేవనది అయిన గంగామాతను మనస్సులో నిలుపుకుని ఆనందాన్ననుభవిద్దాము.


Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...