18. భారతమాతా బుధజన గీతా ...

18. భారతమాతా బుధజన గీతా ...

Audio Link
బుధజనుల చేత కీర్తించబడుతున్న, నిర్మలమైన గంగాజలముతో పవిత్రము చేయబడిన భారతమాతకు జయమగుగాక !

తన శిరోభాగములో హిమాలయ పర్వతముల మంచు పొరలతో విరాజమానమై, పాదముల వద్ద హిందూ మహా సముద్ర జలములు కలిగి, జఘన భాగంలో సత్యమనే లతలను, వృక్షములను వస్త్రములుగా ధరించి ప్రకాశిస్తున్న భారత జననికి జయమగుగాక !

ఋషివరుల చేత ఘోషింపబడుతున్న మంత్రములతో పులకిస్తూ, కవుల సముదాయము చేత కీర్తించబడిన పవిత్ర చరిత్ర కలిగిన, ధీరులు వీరులు అయిన రాజుల చేత పాలింపబడిన భారతమాతకు జయమగుగాక !
నా మనస్సులో ఎప్పుడూ నీ పాద యుగళమే భాసిస్తుంది. సంస్కృతము గురించి, మన సంస్కృతిని గురించి సతతము ఆలోచిస్తూ ఉంటాను.
భావరాగలయతాళములతో మేళవించిన భారత జననీ ! నీకు జయమగుగాక !

బుధజనుల చేత కీర్తించబడుతున్న, నిర్మలమైన గంగాజలముతో పవిత్రము చెయ్యబడిన భారతమాతకు జయమగుగాక !
నా మనస్సులో ఎప్పుడూ సంస్కృతమును గురించి, సంస్కృతిని గురించి ఆలోచిస్తూ ఉంటాను. భారతమాతా ! నీకు జయమగుగాక !


Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...