7. విలసతు సా మే రసనాగ్రే ...

7. విలసతు సా మే రసనాగ్రే ...

Audio Link
మహర్షుల చేత ధ్యానములో సాక్షాత్కరించుకో బడిన వేదవాణి నా నాలిక మీదే ప్రకాశిస్తూ ఉండాలి, నా హృదయ పద్మమునందే నిలిచి ఉండాలి. ఏ వాణి పరాశర మన్వాది మహర్షుల చేత ధర్మశాస్త్రముల రూపంలో విస్తరించ బడిందో, ఏ వాణి వాల్మీకి మహర్షి చేత రచించబడిన రఘురాముని చరిత్ర కలిగి ఉన్నదో, ఏ వాణి వ్యాసమహర్షి చేత రచించబడిన పంచమవేద రూపంలో ఉన్నదో, ఏ వాణి జైమిని కపిల పతంజలి గౌతమాది మహర్షుల చేత రచించబడిన శాస్త్రముల రూపంలో ఉన్నదో, ఏ వాణి చేత వేదాంతము ప్రతిపాదింపబడి మోక్ష ప్రదాయకమైన తత్త్వ మార్గాన్ని తెలియ జేస్తోందో, ఏ వాణి భారవి బాణుడు మొదలైన వారి కావ్యనాటకాలతో ప్రసిద్ధి చెందినదో, చంపూ రచనలతో, రూపకాలతో ముక్తకాలతో, స్తోత్రాలతో ప్రకాశిస్తోందో, అటువంటి వాణి నా నాలిక మీదే ప్రకాశిస్తూ ఉండాలి, నా హృదయ పద్మంలో నిలిచి ఉండాలి. ఏ భాష ప్రపంచంలోని సర్వ భాషలకు ప్రాణము వంటిదో, కోటాను కోట్ల భాషలలో ఏ ఒక్క భాష దైవశక్తి భరితమైన దేవభాషో, అటువంటి వేదవాణి, దేవభాష నా రసనాగ్రమున నిలిచి ఉండుగాక ! నా హృదయ పద్మంలో ప్రకాశించు గాక !



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...