21. హిందూ రాష్ట్ర సంఘటనం ... కేశవం స్మరామి ...

21. హిందూ రాష్ట్ర సంఘటనం ... కేశవం స్మరామి ...

Audio Link
హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే సుజనులచే పూజింపబడే పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను.

ఇది సనాతనమైన హిందూ రాష్ట్రము, చీలికలు చేయబడి చిరకాలము దాస్యము ననుభవించినది. దుఃఖముతో, దైన్యముతో పీడించబడిందని తలుచుకుంటేనే బాధ కలుగుతోంది. పరమ పూజనీయుడైన కేశవుని సదాస్మరించాలి.

ఈ దేశం జగతిలోకే శ్రేష్ఠమైనది. భగవద్ధ్వజమే రాష్ట్ర గురువుగా ఉన్నటువంటిది. ఎల్లప్పుడూ స్మరింపవలసిన గోప్పదైన దైవ తత్త్వాన్ని బోధిస్తున్నది.

హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే, సుజనులచే పూజింపబడే, పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను.

ధర్మాచరణే పరమ వ్రతముగా, సత్ శీలమే పరమ ప్రయోజనముగా ప్రవర్తించాలి. బోధించిన దానిని ఆచరించాలి.

మన దేశానికి గొప్ప వైభవాన్ని తీసుకుని రావాలి. దేశ ప్రజలలో అంతర్గతంగా ఉన్న సకల భేదభావములు తొలగిపోవాలి. సంఘంలో అందరూ ఏకమై సంఘటితంగా ఉండాలి.

హిందూ రాష్ట్రాన్ని సంఘటిత పరిచే, సుజనులచే పూజింపబడే పరమ పూజనీయుడైన కేశవుని ఎల్లప్పుడూ స్మరిస్తాను.


Sent from my iPhone

Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...