29. జయతాత్ సంస్కృత వాణీ మధురా ....
29. జయతాత్ సంస్కృత వాణీ మధురా ....
Audio Link
మధురమైన సంస్కృత వాణికి జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించబడుగాక !
మంజుల భాషిణియై, అందమైన విలాసము కలిగిన, రమ్యమైన కలరవముతో నదిలా ప్రవహించే సంస్కృత వాణికి, సరస్వతీ మాతకు జయమగుగాక !
పవిత్రమైన ముని జనుల కుటీరములలో విహరించునటువంటి, సుమనో మందిరములకు లాస్యమును కలిగించునటువంటి, అంతులేని సౌందర్య రాశీ ! లలిత కళా స్వరూపిణీ ! వల్మీకము లోనుంచి పుట్టిన ఆది కవీశ్వరుని వలన ఘనత గాంచినదానా ! ఓ జ్ఞానప్రదాయినీ ! సరస హృదయులకు విలాసము కలిగించుదానా ! పెద్ద విపత్తులను కూడా ఉపశమింపజేయుదానా !
మధురమైన సంస్కృత వాణీ ! నీకు జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించబడుదువు గాక !
సత్యము, శాంతి, శమము, దమములను ఉపదేశించుదానా ! ధర్మకార్యాలు చెయ్యటానికి ధైర్యాన్ని కలిగించేదానా ! రసవిహీనమైన జగత్తులో నవరసాలను నింపినదానా ! జనుల తాపాన్ని వెంటనే పోగొట్టేదానా ! కలి దోషాలను పోగొట్టు తల్లీ ! భవసాగరాన్ని దాటించేదానా ! సరసిజభవుడైన బ్రహ్మదేవుని పట్టపురాణీ ! సరస్వతీదేవీ !
మధురమైన సంస్కృత వాణీ ! నీకు జయమగుగాక ! విశ్వ జనుల చేత ఆదరించ బడుదువుగాక !
🙏🙏🙏🌹
డా.విశాలాక్షి.

Comments
Post a Comment