9. జయినీ భవ సురవాణీ ...
9. జయినీ భవ సురవాణీ ...
Audio Link
సురవాణికి జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాను. ఈ జగత్తుకు నువ్వు శుభవాణివి అగుదువు గాక !
శ్రుతులలో సుఖంగా నినదించే శుభప్రదురాలా ! కవివరులలో ప్రకాశిస్తూ, వరము లనుగ్రహించేదానా !
ఏ అవయవమునందు చ్యుతి లేనిదానా ! అంటే, పద వాక్య ప్రమాణాలలో వ్యాకరణ, మీమాంస, తర్క జ్ఞానము కలిగి ఉండి శబ్ద శక్తి కలిగిన దానా ! ఓ సురవాణీ ! నీకు జయమగుగాక !
నీ సర్వాంగములలో - సర్వ శాస్త్రములలో అచ్యుతుని జ్ఞానము - పరమాత్మ జ్ఞానము కలిగినదానా ! నవరసములను కలిగినదానా ! మధురమైనదానా ! నీవే కామధేనువువు, సకల కామనలను తీరుస్తావు. నీవే జ్ఞానామృతము ! జ్ఞానమును వర్షిస్తావు.
అటువంటి సురవాణికి - సంస్కృత భాషకు జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాను. ఈ సకల జగత్తుకు నువ్వు శుభవాణివి అగుదువు గాక !
నీవు సనాతన ధర్మ మును ధరించి ఉన్నావు. భాషాజాలమును పుట్టిస్తున్నావు. భగవద్గీతామృత ధారను వర్షిస్తావు. అఖిల వేదసారమునూ ఎల్లప్పుడూ చెప్తూంటావు. నీవు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తావు, బుద్ధిని వృద్ధి చేస్తావు. అటువంటి సురవాణికి జయమగుగాక ! నిన్ను స్తోత్రిస్తాను. నిన్ను శరణువేడతాను. ఈ జగత్తుకు నువ్వు శుభవాణివి అగుదువు గాక !

Comments
Post a Comment