15. ఐక్యమంత్రము -
15. ఐక్యమంత్రము -యం వైదికా మంత్రదృశః ..
Audio Link
ఏ పరమాత్మను సనాతనులైన, వేద మంత్ర ద్రష్టలైన మహర్షులు ఇంద్రునిగా, యమునిగా, మాతరిశ్వునిగా అనగా వాయుదేవునిగా చెప్తారో, ఏ పరబ్రహ్మమును వేదాంతవేత్తలు అనిర్వచనీయుడు అని చెప్తారో, ఎవరిని పరబ్రహ్మ అంటూ బ్రహ్మ శబ్దంతో చెప్తారో, ఎవరిని శైవులు శివుడు - అంటారో, ఎవరిని వైష్ణవులు విష్ణువని స్తుతిస్తారో, బౌద్ధులు బుద్ధుడనీ, జైనులు అర్హుడనీ వ్యవహరిస్తారో, శిఖ్ఖులు సత్ శ్రీ అకాలంటారో, ఏ దైవాన్ని కొంతమంది శాస్త అనీ, మరికొంత మంది కుమారస్వామి అనీ అంటారో, ఏ జగదీశ్వరుడిని భక్తి తో స్వామీ అని, తల్లి అనీ, తండ్రి అనీ పిలుస్తారో, ఆ ప్రభువు అద్వితీయుడైన ఒకే పరమాత్మ. జగదీశ్వరుడైన ఆ ఒక్క పరబ్రహ్మ తత్త్వాన్నే భిన్న భిన్న నామాలతో రూపాలతో వ్యవహరిస్తారు. కానీ ఉన్నది ఒక్కటే తత్త్వము, ఒకే దైవము.

Comments
Post a Comment