2. జయ నమో విధిరమణి ...
2. జయ నమో విధిరమణి ..
Audio Link
భువనమోహిని అయిన, అభయమును అనుగ్రహించే తల్లి, బ్రహ్మదేవుని భార్య అయిన, సకల శుభములకు నెలవైన శుభప్రదురాలైన వాణికి, సరస్వతీ మాతకు జయమగుగాక. కరుణతో కూడిన అలలను వర్షించే కన్నులు కలిగి, అజ్ఞానమనే చీకటికి సూర్యకిరణములవంటిదైన, కలువ రేకుల వంటి కన్నులు కలిగిన జగన్మాతకు నమస్కరించుదాము. ఛందోబద్ధమైన అక్షరస్వరూపిణి అయిన వాణి రాజగృహములో గౌరవము కలుగ జేసే దేవి, అభయప్రదాయిని అయిన మాత కవులలో ప్రకాశించే తల్లి నా వాక్కులో ఓజస్సును తేజస్సును బలమును కలిగించు గాక ! భూమి మీద శోణీతటిలో వెలసిన, అందమైన బంగారు కాంతితో ప్రకాశిస్తూ, చేతిలో సుస్వనము కలిగిన వీణను ధరించి, అజ్ఞానమును పోగొట్టే తల్లికి జయమగుగాక !

Comments
Post a Comment