22. ఆయాహిరే ! ఆయాహిరే ...

22. ఆయాహిరే ! ఆయాహిరే ...

Audio Link
ఆకాశంలో అందమైన కాంతులతో ప్రకాశించే చందమామా ! ఇచటికి రమ్ము. అంతటా ఎంతో ఆహ్లాదకరమైన, మనోజ్ఞమైన చిక్కని వెన్నెలను వ్యాపింపజేస్తున్న చంద్రుడా ! వచ్చెయ్యి. వచ్చెయ్యి. సింధూనది ప్రవహిస్తూ, చంద్రకిరణాల స్పర్శతో ఆనందంగా ఉవ్వెత్తున తరంగాలు లేచి చేస్తున్న ఘోష రోదసిలోని గుహలలో ప్రతిధ్వనిస్తోంది. ఓ ధీవరా ! ఆకాశంలో ప్రయాణించు.

తమస్సుకు ప్రియుడా ! తారకలనే కన్నులు కలిగిన ఆమెను నీ దరహాస కాంతులలో ముంచెత్తుతూ, నీ దేహమంతా మంజులమైన కాంతి పుంజమై సంచరించే చంద్రమా ! ప్రయాణించు.

నక్షత్రాలు నిశ్చలంగా ప్రకాశిసిస్తున్నాయి. సాగరునిచే చుంబించబడి వెన్నెల ఎంతో మోదము పొందుతోంది. లాస్య హాస్యాలతో విలాసంగా చిత్తరువులా ప్రకాశిస్తోంది. రాగ రంజితమైన రాగిణిలా శోభిల్లుతోంది.
ఆకాశగమనంలో ఉన్న ఓ ధీవరా ! ప్రయాణించండి.
ప్రయాణించండి.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...