24. స జయతి జగతి సనాతన ధర్మః ...

24. స జయతి జగతి సనాతన ధర్మః ...

Audio Link
జగత్తులో సనాతన ధర్మము జయము పొందుతుంది. ఇది సత్యము. సనాతన ధర్మము మానవాళికి చేస్తున్న మనోజ్ఞమైన, నిత్య నూతనమైన ఉపదేశమిది.

శ్రీమహావిష్ణువునైనా, లేక శంకరుడినైనా పూజించండి. జినుడినైనా, బుద్ధుడినైనా లేక ఏ దైవమునైనా కొలవండి. ఉన్నది ఒక్క దైవమే ! పేర్లు మాత్రమే తేడా ! ఇందులో ఏమాత్రమూ వివాదం లేదు.

ఇతడు స్పృశింపదగినవాడు, ఇతడు అస్పృశ్యుడు అనీ, ఒకడు ఉచ్చమైనవాడు మరొకడు నీచమైనవాడు అనీ ఈ విధమైన భావాలన్నీ, భేదాలన్నీ కేవలం కల్పితాలు మాత్రమే ! భూలోకమొక్కటే మనందరికీ నివాస స్ధానము, మానవులందరూ ఒక మానవజాతే ! కనుక అందరూ సోదరులే ! ఈ సత్యాన్ని విస్మరించవద్దు.

జాతిలో భేదం లేదు, నీతిలో భిన్నత లేదు, మన లక్ష్యము, కార్యములు అభిన్నములే ! కనుక అందరూ కలిసి నడవండి. సంఘటితంగా ఉండటంలోనే శక్తి ఉంది. వేషాలు వదిలేసి, భేదాలు విస్మరించి, లక్ష్యాన్నే ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకుని మనమందరమూ కలిసి పనిచేస్తే, కార్య సిద్ధిని పొందుతాము.

ధైర్యమునందు అభిలాష, చేసే పనులయందాసక్తి, దైవమునందు భక్తి, పాపమునందు విరక్తి అందరికీ కూడా భవభయములను తరించటంలో ఇదే ఉపాయము. మనస్సుతో ఎప్పుడూ శుభాన్నే భావించాలి, చేసే పనులు ఎప్పుడూ శుభము కలిగించేవే చెయ్యాలి. దానివల్లే మనకి శుభం కలుగుతుంది.

జగత్తులో సనాతన ధర్మము జయము పొందుతుంది. ఇది సత్యము. సనాతన ధర్మము మానవాళికి చేస్తున్న మనోజ్ఞమైన ఉపదేశము నిత్య నూతనము.

🙏🙏🙏🌹
డా.విశాలాక్షి.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...