మాననీయ శ్రీమతి విశాలాక్షి గారికి హార్దిక శుభాభినందనవందనములు
Dr. VLN Sastry
MD(Ay)(BHU)., PGDHHM,
M.Sc.(Psychology)., LL.B
~~~~~~~~~~~~~~~~~~~~ 06-06-2018~~~
★మాననీయ శ్రీమతి విశాలాక్షి
గారికి హార్దిక శుభాభినందనవందనములు.
**************************
■ (సీ)
*తాతముత్తాతల
తంగిరాలాన్వయ
తత్త్వరక్తంబున్న తరుణితార
*వేదవాజ్ఞ్మయయుక్త
గోదావరీతోయ
మాధుర్యసేవిత మహిళధీర
*గీర్వాణసాహిత్య
మృష్టాన్నసారంబు
నరనరాలందున్న నారిరత్న
*వేదాంతశోధనల్
విస్తృతంబుగజేసి
ప్రాశస్త్యమందిన పడతిముక్త
(తే.గీ.)
*భూరి సోమంచివంశమున్
చేరియామె
*జ్ఞానతృష్ణ రాధాకృష్ణ
సతిగయయ్యె
*భారతీయ ధర్మములకున్
పట్టుగొమ్మ
*నుత విశాలాక్షి,
హైందవమతపుకుక్షి.
★(ఆ.వె.)
*మధురగాత్రమున్న
మానవీయతయున్న
*మంచి చిత్తమున్న
మాతృమూర్తి
*పుట్టినిల్లెగాక
మెట్టినింటికిగూడ
*దీప్తినిచ్చు భామ దివ్యమూర్తి.
రాధాకృష్ణులలోని రాధయె విశా
లాక్షీ స్వరూపమ్ము- జ్ఞా
నా ధారప్రతిపాదకత్వము -సుధా
న్నప్రాయసత్యాత్మక
ప్రాదుర్భావవచోవిలాసము మహా
వాక్య ప్రతిష్ఠా0తర
శ్రీధుర్యమ్ము వెలుంగుగాత చిర కీ
ర్తిన్ చంద్రతారార్క మై!!
Sent from my iPhone
MD(Ay)(BHU)., PGDHHM,
M.Sc.(Psychology)., LL.B
~~~~~~~~~~~~~~~~~~~~ 06-06-2018~~~
★మాననీయ శ్రీమతి విశాలాక్షి
గారికి హార్దిక శుభాభినందనవందనములు.
**************************
■ (సీ)
*తాతముత్తాతల
తంగిరాలాన్వయ
తత్త్వరక్తంబున్న తరుణితార
*వేదవాజ్ఞ్మయయుక్త
గోదావరీతోయ
మాధుర్యసేవిత మహిళధీర
*గీర్వాణసాహిత్య
మృష్టాన్నసారంబు
నరనరాలందున్న నారిరత్న
*వేదాంతశోధనల్
విస్తృతంబుగజేసి
ప్రాశస్త్యమందిన పడతిముక్త
(తే.గీ.)
*భూరి సోమంచివంశమున్
చేరియామె
*జ్ఞానతృష్ణ రాధాకృష్ణ
సతిగయయ్యె
*భారతీయ ధర్మములకున్
పట్టుగొమ్మ
*నుత విశాలాక్షి,
హైందవమతపుకుక్షి.
★(ఆ.వె.)
*మధురగాత్రమున్న
మానవీయతయున్న
*మంచి చిత్తమున్న
మాతృమూర్తి
*పుట్టినిల్లెగాక
మెట్టినింటికిగూడ
*దీప్తినిచ్చు భామ దివ్యమూర్తి.
రాధాకృష్ణులలోని రాధయె విశా
లాక్షీ స్వరూపమ్ము- జ్ఞా
నా ధారప్రతిపాదకత్వము -సుధా
న్నప్రాయసత్యాత్మక
ప్రాదుర్భావవచోవిలాసము మహా
వాక్య ప్రతిష్ఠా0తర
శ్రీధుర్యమ్ము వెలుంగుగాత చిర కీ
ర్తిన్ చంద్రతారార్క మై!!
Sent from my iPhone

Comments
Post a Comment