20. ఏత బాలకాః ... భూమిరియం బలిదానస్య ...

Audio Link
బాలకులారా ! రండి. మీకు హిందూ దేశము యొక్క తేజస్సును చూపిస్తాను, భారత వర్షము యొక్క తేజస్సును వివరిస్తాను. ఇక్కడి మట్టి కూడా తల మీద పెట్టుకుని నమస్కరించవలసినది. ఈ భూమి బలిదానములు చేసినటువంటిది. దేశమాతకు జయమగుగాక ! భూమాతకు జయమగుగాక !
మన భారతదేశానికి ఉత్తరమున ప్రఖ్యాతి గాంచిన హిమాలయ పర్వతములున్నాయి. దక్షిణ దిశలో అరేబియా సముద్రమున్నది. భారత దేశంలో పరమ పావనమైన గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ అడుగడుగునా కనిపించే దివ్యత్వం దేవతల లోకంలో కూడా ఉండదు. దేవతలు అవతరించే ఈ దివ్య భారత భూమియే భూలోకంలో ఒకే ఒక్క దివ్య స్ధానము.
ధర్మరక్షణ కోసం యుద్ధంలో మరణించటమే సన్మానముగా భావించే మహా పరాక్రమ వంతులైన, ఖడ్గవిద్య యందభిమానము కలిగిన రాజపుత్రులకు ఇది నెలవు. విశ్వవిఖ్యాతి గాంచిన ప్రతాపరుద్రుడు ఇక్కడివాడే ! ఇక్కడ శీల రక్షణ కోసం అసంఖ్యాకులైన పద్మినీ జాతి స్త్రీలు అగ్ని లో ఆహుతి అయి దగ్ధమయ్యారు. అటువంటి వీరుల పాదపద్మముల దుమ్ము - పరాగ రేణువులతో పవిత్ర మైనది ఈ దేశము.
వంగ దేశము మొదలైన సర్వప్రాంతాలు పచ్చని పైరులతో మనోహరంగా ఉంటాయి. ఈ దేశంలో బాలురు కూడా దేశరక్షణ కోసం మరణానికి సిద్ధమై ఉంటారు. ఈ పుణ్య భూమి మీదే శ్రీ రామకృష్ణ పరమహంస, గౌరాంగుడు, స్వామి వివేకానంద మొదలైన ప్రముఖులు పుట్టారు. క్రాంతి కారకులు, శాంతి కాముకులు కూడా ఇక్కడ జన్మించారు. అరవిందఘోష్ లాంటి వారు, ప్రఖ్యాతి గాంచిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లాంటి వారిని కన్న తల్లి ఈ భారత భూమి.
మహారాష్ట్ర ప్రాంతాన్ని తన నాయకత్వం తో ఛత్రపతి శివాజీ కాపాడుతుండగా ఆక్రమించటానికి ప్రయత్నించి యుద్ధానికి వచ్చిన మ్లేచ్ఛులను భవానీ దేవియే తన కరవాలంతో దునుమాడింది. ప్రతి చోట, కొండగుహలలో కూడా పరాక్రమాగ్ని ప్రజ్వరిల్లింది. బాలుర దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ అని ఘోషిస్తూ దేశరక్షణకు ఉద్యమించారు. ఇటువంటి మన భారతదేశం యొక్క రక్షణ కార్యం స్వయంగా శివుడే చేపట్టాడు. అటువంటి మన భారత దేశపు మట్టిని శిరస్సున ధరించి పూజించాలి.
కృష్ణా గోదావరి మధ్యప్రదేశమైన దక్షిణ భారతదేశంలో ప్రజలు భక్తి కలిగి ఉంటారు. ఇక్కడి గుళ్ళ గోపురాలు ఆకాశమంత ఎత్తున ఉండి, అత్యంత ఉదాత్తమైన శిల్ప కళలతో విరాజమానమై ఉంటాయి. ఇక్కడ సీతాపతి అయిన శ్రీ రామచంద్రుని పాద స్పర్శ తో పునీతమైన జనస్థానము, జగద్గురువులైన పూజనీయులు శ్రీ ఆదిశంకరాచార్యుల జన్మస్థానమైన కేరళ దేశము, హిందూ ధర్మంలో ప్రఖ్యాతిగాంచిన విజయనగర సామ్రాజ్యము ఇక్కడే ఉన్నాయి. అటువంటి భారతమాతకు జయమగుగాక !

🙏🙏🙏🌹
డా. విశాలాక్షి.

Comments
Post a Comment