25. నమో నమోంబ దేవవాణి ...

25. నమో నమోంబ దేవవాణి ...

Audio Link
దేవవాణీ ! అన్ని కోర్కెలను తీర్చే సంస్కృత భాషా మాతా ! నీకు నమస్కారము. కామరూపిణీ ! నన్ను పవిత్రురాలినిగా చెయ్యమ్మా ! నన్ను రక్షించమ్మా ! నీకు మనస్కారము.

యజ్ఞ ధూమముతో పవిత్రము చేయబడిన, తపోవనవాటికలలో ప్రతిధ్వనించే తల్లీ ! పవిత్రమైన జలాలతో ప్రవహిస్తూ మంజులమైన ధ్వని చేస్తూ, యోగినిలా దర్శనమిచ్చే తల్లీ ! యోగము చేత పాపము పోగొట్టబడగా అమలినమైన ముఖములలో ప్రకాశించే తల్లీ ! భోగ రూపమైన సుందర స్వర్గమును, అపవర్గమును - మోక్షమును కూడా కలిగించే దేవవాణీ !నీకు నమస్కారము.

అందమైన శబ్దములనబడే ముఖముతో మోహింపచేస్తూ,
అందమైన పదములతో ప్రకాశిస్తూ, సుందర పదబంధ మార్గంలో పయనిస్తూ, వ్యాస, వాల్మీకి, కాళిదాస, భాసాదులతో ప్రకాశిస్తున్నదానా !
రమ్యమైన వాగ్విలాసంతో ప్రకాశిస్తూ, రంగస్థలం మీద నృత్తాలతో, నాట్యాలతో ప్రదర్శించబడటం వల్ల శోభిల్లుతూ, భవ్యమైన భావాలతో, వాగ్విలాసంతో ప్రకాశించే దేవవాణీ ! నీకు నమస్కారమమ్మా ! నా కోర్కెలను నెరవేర్చు. నన్ను కాపాడు, నన్ను పవిత్రం చెయ్యమ్మా !

తర్కశాస్త్రం చేత పద బంధాల చేత మనస్సును రంజించేదానా ! కర్మ గురించి, పరబ్రహ్మ గురించిన జ్ఞానాన్ని బోధిస్తూ, గూఢమైన తత్త్వాన్ని దర్శింప జేసేదానా ! వేద శబ్దములతో జ్ఞానమును కలిగించే మనోన్మనీ ! ఉదారమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రవాహ స్వరూపిణీ ! నీకు నమస్కారమమ్మా.

దేవవాణీ ! అన్ని కోర్కెలను తీర్చే సంస్కృత భాషా మాతా ! నీకు నమస్కారము. కామరూపిణీ ! నన్ను పవిత్రురాలినిగా చెయ్యమ్మా ! నీకు మనస్కారము.

🙏🙏🙏🌹
డా.విశాలాక్షి.


Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...