32. ధ్యేయపథిక సాధక ...

32. ధ్యేయపథిక సాధక ...

ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గం లో పయనించు. మృదువుగా నవ్వుతూ, తేనెలు చిలుకుతూ, అంటే తేనెలొలుకు మాటలను మాట్లాడుతూ, తల్లిని ఎప్పుడూ స్మరిస్తూ, మాతృదేశ మాతను స్మరిస్తూ ముందుకు దూసుకు వెళ్ళు.

జీవితం శాశ్వతమైనది కాదు. ఈ వైభవము స్థిరమైనది కాదు. స్వార్ధాన్ని పులుముకోకుండా ఏ కార్యాలనాచరిస్తారో అవే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. జీవితంలో ఋజు మార్గ ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన సరళంగా ఉండాలి. ఆలోచనలు గొప్పగా ఉండాలి. మనం సమాజంతో పోషించ బడుతున్నాము. మనం కూడా సమాజాన్ని చిరకాలము పోషించాలి.

ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గంలో పయనించు.

ఎవరు మనసులో ఏది ఆలోచిస్తారో, దేనిని మాటలతో కీర్తిస్తారో, అదే, ఆ మూర్తే వారి మనస్సుల్లో, వారి జీవితాలల్లో నిండి ఉంటుంది. మాతృదేవి యొక్క చరణాలకు అనన్య భక్తితో మన జీవితాన్ని సమర్పించాలి. మాతృదేశ రక్షణే మన ధ్యేయం. ధ్యేయాన్ని
సాధించటమే వ్రతంగా కలిగి మనమందరం కలిసి ఉండాలి.

ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గం లో పయనించు.

ఎంతమంది మన ముందరి వారు త్యాగాలు చేశారో, దేశంకోసం బలిదానమిచ్చారో, వారిని స్మరించుకోవాలి. మనమందరమూ సింహ విక్రమము కలవారము. పరాక్రమవంతమైన కుటుంబాలలో జన్మించాము. కోటాను కోట్ల కష్టాలెదురైనా, ఎన్ని విఘ్నాలు కలిగినా, ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే, మనం కట్టుబడి ఉంటాము. పలాయనం చిత్తగించము.

ధ్యేయాన్ని సాధించటానికి పయనించే ఓ సాథకుడా ! కార్యాన్ని సాధించే మార్గం లో పయనించు. మృదువుగా నవ్వుతూ, తేనెలు చిలుకుతూ,అంటే తేనెలొలుకు మాటలను మాట్లాడుతూ, తల్లిని ఎప్పుడూ స్మరిస్తూ, మాతృదేశ మాతను స్మరిస్తూ ముందుకు దూసుకు వెళ్ళు.

🙏🙏🙏🌹
డా. విశాలాక్షి


Sent from my iPhone

Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...