35. సురస సుబోధా **నైవ క్లిష్టా

35. సురస సుబోధా .. నైవ క్లిష్టా ...
Shloka Audio

అమృతవాణి అయిన సంస్కృత భాష మంచి రసభరితమైనది. అందరికీ సులభంగా అర్ధమవుతుంది. విశ్వంలో అందరి మనస్సులకు ఆనందాన్ని కలిగించే, లలితమైన భాష. హృదయానికి ఆనందం కలిగించే, రమణీయమైన సంస్కృత భాష కఠినమైనది కాదు, క్లిష్టమైనది కాదు.

కవి కోకిల అయిన వాల్మీకి మహర్షి చేత రచింపబడిన రమణీయమైన రామాయణ కథ చాలా సులభంగా అర్ధమవుతుంది, మధురమైనది, మంజులమైనది. అది అసలు క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు.

వ్యాసమహర్షి చేత రచింపబడి, గణపతి చేత లిఖించబడిన, కౌరవ పాండవ యుద్ధంతో కూడిన మహాభారత పుణ్యకథ క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు.

కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉపదేశింపబడిన, కర్మ గురించి బోధించిన, విశ్వవందితమైన భగవద్గీత అమృతము వలె మధురమైనది. అది అసలు క్లిష్టమైనది కాదు, కఠినమైనది కాదు.

కవికులగురువైన కాళిదాస మహాకవి రస భరిత రచనలు రఘువంశ ము, కుమారసంభవము, ఋతుసంహారము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము అన్నీ కూడా క్లిష్టమైనవి కావు, కఠినమైనవి కావు.

అమృతవాణి అయిన సంస్కృత భాష మంచి రసభరితమైనది. అందరికీ సులభంగా అర్ధమవుతుంది. విశ్వంలో అందరి మనస్సులకు ఆనందాన్ని కలిగించే, లలితమైన భాష. హృదయానికి ఆనందం కలిగించే, రమణీయమైన సంస్కృత భాష కఠినమైనది కాదు, క్లిష్టమైనది కాదు.

🙏🙏🙏🌹
డా. విశాలాక్షి.

Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...