33. విస్మృత భేదాః సన్తో ....
33. విస్మృత భేదాః సన్తో ....
Audio Link
ఓ సత్పురుషులారా ! పరస్పర భేద భావాలను విస్మరించండి. నిర్మల భావములను కలిగి, ఎల్లప్పుడూ అందరూ సమానమనే ఏకతా భావాన్ని హృదయంలో పొందండి.
మన ప్రాచీన మహర్షులు, కవులు అందరూ, మానవులందరు ఐకమత్యంతో ఉండాలని కోరారు. అందరూ సుఖంగా ఉండాలని వారు చేసే గానం ఎంతో హృద్యమైనది. భాష వల్ల, ధనము వల్ల, మతము వల్ల కలిగే మదము, జాతి విభేదము ఎవరి హృదయాలలోనూ ఉండరాదు. దుఃఖిత జనులను ఉద్ధరించటం కోసం చేతులు జాపండి.
ఓ సత్పురుషులారా ! పరస్పర భేద భావాలను విస్మరించండి. హృదయంలో నిర్మల భావములను కలిగి ఎల్లప్పుడూ అందరూ సమానమనే ఏకతా భావాన్ని పొందండి.
గంగా, తుంగభద్ర, కావేరీ నదుల జలమంతా మనదేనని భావిస్తూ, సంకల్పించిన కార్యాన్ని చెయ్యటానికి బద్ధకాన్ని వదిలి ఆలస్యం చెయ్యకుండా త్వరగా ప్రయత్నించండి. ఈ భూమిని బంగారు పుష్పంగా మార్చటానికి రారండి. కోరిన కామితములను సాధించటానికి చెమటను శ్రోతస్సులా ప్రవహించనీయండి ! ధైర్యం వదలద్దు. ఘర్షణలు, దొంగతనాలు, వంచన, సంహరణలు, ప్రళయం వస్తే రానీ ! స్నేహమనే శ్రోతస్సు ప్రవహించాలి. అందరమూ సోదరులమనే పరస్పర ప్రేమ భావం హృదయంలో ప్రకాశించాలి. అందరికీ గాలి నీరు నిప్పు సర్వమూ సమానమే ! తల్లి యొక్క రక్తం మనందరిలోనూ అవిభక్తంగా ప్రవహిస్తోంది. మనలో భేదాలు వద్దు.
ఓ సత్పురుషులారా ! నిర్మల భావములు కలిగి, పరస్పర భేద భావాలను విస్మరించండి. హృదయంలో ఎల్లప్పుడూ అందరూ సమానమనే ఏకతా భావాన్ని పొందండి.
🙏🙏🙏🌹
డా. విశాలాక్షి

Comments
Post a Comment