30. మునివర వికసిత కవివర విలసిత ...
30. మునివర వికసిత కవివర విలసిత ...
Audio Link
మునివరులతో వికసింపబడిన, కవివరులతో ప్రకాశించే మంజులమైన పెట్టెలాంటిది సుందరమైన సురభాష.
ఓ తల్లీ ! సురభాషా ! ఎంత సహనంతో మమ్మల్ని పోషిస్తున్నావో, నా మాటలతో చెప్పలేను. ఓ అందమైన దేవభాషా ! నీవు వేద వ్యాస, వాల్మీకి, కాళిదాస భాస, బాణభట్టాది కవుల రచనలతో పరిపుష్టమయి, పురాణాల కథనంతో సామాన్య జనులకు జీవితాశను కలిగిస్తున్నావు.
శ్రుతుల రూపంలో జ్ఞానాన్ని బోధిస్తూ అందరికీ ప్రమోదము కలిగిస్తూ, స్మృతుల రూపంలో సరసమైన, సౌఖ్యవంతమైన జీవన మార్గాన్ని బోధిస్తూ, ఆనందాన్ని కలిగిస్తూ, ఎన్నో కావ్య రచనలు చేయటానికి ప్రేరణనిస్తూ, సంస్కృతిని నింపుకుని ఉన్న సుందరమైన సురభాషవు నీవు.
నవరసాలతో కూడిన రచనలతో అలంకరింప బడుతూ, వేద విషయమైన వేదాంతసారాన్ని విచారిస్తూ, వైద్యశాస్త్రమూ, వ్యోమ శాస్త్రము, ఖగోళ విజ్ఞానము కలిగి శోభిల్లుతున్న నీవు ఈ భూమిలో విజయమును పొందుదువు గాక !
మునివరులతో వికసింపబడిన, కవివరులతో ప్రకాశించే మంజులమైన పెట్టెలాంటిది సుందరమైన సురభాష. దేవభాష జయమును పొందుగాక !
🙏🙏🙏🌹
డా. విశాలాక్షి

Comments
Post a Comment