11. మమ మాతా దేవతా ...

11. మమ మాతా దేవతా ...

Audio Link
మా అమ్మ దేవత ! మా అమ్మ ఎంతో సరళమైనది, నాతో ఎంతో మృదువుగా ఉంటుంది. ఇంటి పనులను చెయ్యటంలో ఎంతో సామర్ధ్యం కలిగినది. మా అమ్మ సాటిలేనిది. నాకు చక్కగా పాలు తాగిస్తుంది, అన్నం పెడుతుంది, రోజూ నన్ను లాలిస్తుంది, నా మనస్సుకు సంతోషం కలిగిస్తుంది. మా అమ్మ దేవత. ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేస్తుంది, నాకు పాఠం చెబుతుంది, నాకు శుభం కలిగిస్తుంది. ఓ దీపజ్యోతీ ! కళ్యాణీ ! నాకు శుభములను కలిగించు, ఆరోగ్యాన్ని, ధనమును, సకల సంపదలను కలిగించు. దుష్ట బుద్ధులను తొలగించు, అని నాతో ప్రార్ధింపజేసి నాకు సకల శుభాలను కలిగించే మా అమ్మ నాకు దేవత ! రాత్రిళ్ళు నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రబుచ్చుతుంది, ఎంతో మధురమైన పాటలు పాడుతుంది.
మా అమ్మ దేవత ! మా అమ్మ ఎంతో సరళమైనది, నాతో ఎంతో మృదువుగా ఉంటుంది. ఇంటి పనులను చెయ్యటంలో ఎంతో సామర్ధ్యం కలిగినది. మా అమ్మ సాటిలేనిది. మా అమ్మ దేవత ! మా అమ్మ దేవత !!



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...